పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

కష్టాల సింహావలోకనం 2


ఒక బిల్లు ప్రవేశపెట్టబడించి యీ విషయం అక్కడి భారతీయ పెద్దలకు తెలిసింది ఉలిక్కిపడ్డారు. వాళ్లు కీ. శే. ప్రెసిడెంట్ క్రూగర్ దగ్గరికి వెళ్లారు ప్రెసిడెంటు భారతీయ నాయకుల్ని తన ఇంటిలోనికి రానీయలేదు. ఇంటి ముంగిలిలో నేవాళ్లను నిలబెట్టాడు. వాళ్ల మాటలు కొద్దిగా విని "మీరు ఇస్మాయిల్ సంతతివాళ్లు అందువల్ల మీరు ఈసా సంతతికి బానిసత్వం చేయుటకే పుట్టారు. మేము ఈసో సంతతి వాళ్లం అందువల్ల మీకు మాతో సరిసమానమైన అధికారాలు యివ్వడానికి వీలులేదు మేమిచ్చిన అధికారాలతో మీరు తృప్తిపడక తప్పదు" అని చెప్పి వేశాడు. అతడి మాటల్లో రోషం, కోపం లేవని చెప్పలేము కాని అతనికి అది చిన్నప్పటి నుంచి లభించిన విద్య బాల్యం నుంచి అతడికి బైబిలునందలి పాత టెస్టొమెంట్ బోధించబడింది దాన్నే అతడు నమ్మాడన్నమాట తన విశ్వాసాన్ని బట్టి, శుద్ధ మనస్సుతో ప్రెసిడెంటు చెప్పాడు. కనుక యిందు అతని దోషం ఏముంది? అయితే యింతటి అజ్ఞానంతో కూడిన మాటల ప్రభావం కూడా పడుతుంది కదా 1885 లో తొందర తొందరగా అసెంబ్లీలో ఒక కఠోరమైన బిల్లును ప్యాసు చేశారు. వేలాది భారతీయులు ట్రాన్స్‌వాలును దోపిడీ చేయుటకు సిద్ధంగా వున్నారను భావం ఆ బిల్లులో తొంగిచూచింది. భారతీయ నాయకుల ప్రేరణవల్ల బ్రిటిష్ రాజమాత ఆచట్టాన్ని వ్యతిరేకించవలసి వచ్చింది యీ వ్యవహారం అధినివేశ విభాగం మంత్రి దాకా వెళ్ళింది. యీ చట్టం ప్రకారం ట్రాన్సువాల్‌లో వ్యాపారం చేసుకునేందుకై వచ్చి నివసించిన భారతీయుడు 25 పౌండ్లు చెల్లించి తన పేరు నమోదు చేయించుకోవాలి ఏ భారతీయుడు ట్రాన్స్‌వాలు నందు. ఒక్క అంగుళం భూమికూడా కొనడానికి వీలు లేదు ఓటింగు హక్కు అతడికి లేనేలేదు యిది అనుచితం అన్యాయం కనుక ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం యీ వాదనను సమర్థించుకోలేకపోయింది. చివరికి ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒక సంధి కుదిరింది దాన్ని లండన్ కన్వెన్షన్ అని అన్నారు అందలి 14వనింబంధన బ్రిటిష్ ప్రజల అధికారాలను రక్షించుటకు సంబంధించినది ఆ నిబంధన ప్రకారం పెద్ద (సామ్రాజ్యం) ప్రభుత్వం, యీ చట్టాన్ని వ్యతిరేకించింది. దాని మీద