పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కష్టాల సింహావలోకనం 2


భారతీయులకు ట్రాన్స్‌వాల్‌లో అధోగతి సంప్రాప్తించింది. అయినా భారతీయ వ్యాపారులు ఏదోవిధంగా చర్చల ద్వారానో, సలహా సంప్రదింపుల ద్వారానో, కోర్టులకెక్కో తమ స్థితిని రక్షించుకోసాగారు బోయర్ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి అక్కడి భారతీయుల పరిస్థితి ఎంతో నాసిగాను అనిశ్చితంగాను వున్నది.

ఇక మనం ఫ్రీస్టేట్‌లో భారతీయుల స్థితి ఎలా వున్నదో చూద్దాం అతికష్టం మీద 10 లేక 11 దుకాణాలు భారతీయులు అక్కడ ప్రారంభించేసరికి వారికి వ్యతిరేకంగా తెల్లవాళ్లు ఉద్యమంలేవతీశారు. అక్కడి అసెంబ్లీ పెద్దలు జాగ్రత్తగా వ్యవహరించి భారతీయుల ఉనికినే దెబ్బతీశారు. ఒక కఠోరమైన చట్టం ప్యాసు చేసి తద్వారా భారతీయ వ్యాపారులకు పేరుకు నష్ట పరిహారం చెల్లించి వాళ్లను వెళ్లగొట్టివేశారు. ఏ భారతీయుడు వారి చట్ట ప్రకారం భూమిని కొనకూడదు. రైతుగా ఫ్రీస్టేట్‌లో వుండకూడదు. ఓటింగు హక్కు అనేది లేనేలేదు. ప్రత్యేక అనుమతి పొంది భారతీయులు కార్మికుని రూపంలోనో, లేక హోటలు వైటరు రూపంలోనో అక్కడ వుండవచ్చు. అట్టి అనుమతి అందరికీ లభించదు. తత్ఫలితంగా ప్రముఖ భారతీయులు సైతం ప్రత్యేక అనుమతి పొంది ఫ్రీస్టేట్‌లో రెండు మూడు రోజుల కంటే మించి వుండటకు వీలు లేదు. బోయర్ యుద్ధం నాటికి అక్కడ అంతా కలిపి 40 మంది భారతీయులు హోటళ్లలో వైటర్లుగా పని చేస్తూ వున్నారు

కేప్ కాలనీలో కూడా భారతీయులకు వ్యతిరేకంగా ఉద్యమం కొద్దోగొప్పో సాగుతూనే వున్నది. భారతీయ పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరకూడదు అక్కడి హోటళ్లలో భారతీయ యాత్రికులు వుండకూడదు. అతికష్టంమీద చోటు దొరికితే పుండవచ్చు. యీ విధంగా కాలనీలో కూడా భారతీయులకు అవమానం జరుగుతూ వున్నది. అయితే వ్యాపారం చేసుకొనుటకు, భూమి మీద హక్కు పొందుటకు చాలా కాలం వరకు వాళ్లకు యిబ్బంది కలుగలేదు. కేప్ కాలనీలో ఆ స్థితి ఎందుకు వున్నదో కొంచెం చెప్పడం అవసరం. ముఖ్యంగా కేప్ టౌనులోను, కేప్ కాలనీలోను మలై ప్రజల ఆధిక్యం వున్నది. మలై ప్రజలు మహమ్మదీయులు. అందువల్ల భారతీయ