పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కష్టాల సింహావలోకనం 2



5

కష్టాల సింహావలోకనం -2

ట్రాన్స్‌వాల్ మరియు ఇతర అధినవేశ రాజ్యాలు

1880 కి పూర్వం నుంచే నేటాలు వలెనే, దక్షిణాఫ్రికా యందలి యితర అధినివేశరాజ్యాల్లో కూడా భారతీయులంటే తెల్లవారికి ఏవగింపు బాగా పెరిగింది. కేప్ కాలనీని మినహాయించి మిగతా రాజ్యాల తెల్లవారి హృదయాలలో గిర్‌మిట్ కార్మికుల రూపంలో భారతీయులు మంచివాళ్లేనని, కాని స్వతంత్ర పౌరులుగా మాత్రం భారతీయుల వల్ల దక్షిణాఫ్రికాకు ఎంతో నష్టం కలుగుతుందని భావం గట్టిగా నాటుకుపోయింది. ట్రాన్స్‌వాల్ ప్రజాతంత్ర రాజ్యం అక్కడి ప్రెసిడెంటు దగ్గరికి వెళ్లి మేమూ బ్రిటిష్ సామ్రాజ్య పౌరులమేనని చెప్పుకోవడం హాస్యాస్పదమై పోయింది భారతీయులు చెప్పుకోవలసిందేమైనా వుంటే ప్రిటోరియాలో గల బ్రిటిష్ రాజమాత (ఏజంట్) దగ్గరకు వెళ్లి చెప్పుకోవాలి అయినా మరో విచిత్రం జరిగింది. ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ సామ్రాజ్యాన్నుంచి పూర్తిగా విడిపోయిన తరువాత బ్రిటిష్ రాజదూత భారతీయులకు సహాయపడే వాడు కాని ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ సామ్రాజ్యంలో చేరిపోయిన తరువాత ఆ స్థితి మారిపోయింది లార్డ్ మోర్లే భారత మంత్రిగా వున్నప్పుడు ట్రాన్స్‌వాల్ నందలి భారతీయుల తరుపున వాదించుటకు ఒక ప్రతినిధి బృందం వెళ్లి ఆయనను కలుసుకున్నది. అప్పుడు లార్డ్ మోర్లే ఆప్రతినిధి బృంద సభ్యులకు ఒక్క విషయం స్పష్టంగా చెబుతూ జహబు దారీ ప్రభుత్వాలు ఏర్పడ్డ అధినివేశ రాజ్యాలపై బ్రిటీష్ (సామ్రాజ్య) ప్రభుత్వ నియంత్రణ బహుస్వల్పంగా వుంటుంది. అవి స్వతంత్ర రాజ్యాలు వాటిని యుద్ధానికి ఆహ్వానించగలము యుద్ధం చేస్తామని బెదిరించగలము యుద్ధం కూడా ప్రకటించగలము కాని వాటితో సలహా సంప్రదింపులు మాత్రమే చేయగలము బ్రిటిష్ సామ్రాజ్యానికి, అధినివేశ రాజ్యాలకు మధ్యన గల సంబంధం పట్టుదారంతో కట్టబడివున్నది. ఆహారం బహుసున్నితం కొద్దిగా లాగినా ఆదారం తెగిపోతుంది. వాటిపై బలాన్ని ప్రయోగించుటకు