పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

35


ఆర్డరు లభించ సాగింది. యిందుకోసం భారతీయులు వకీళ్లను నియమించుకోవలసి రావడమే కాక డబ్బు కూడా అమితంగా ఖర్చు చేయవలసి వచ్చింది. సామాన్యులైన భారతీయులు ఆర్డరు లేకుండానే వుండసాగారు. ఒక విచిత్రమైన నిబంధన కూడా అందుచేర్చారు. భారతీయులు నేటాలులో ప్రవేశించదలిస్తే యూరప్‌కు చెందిన ఏదేని ఒక భాష అతడికి తెలిసి యుండలి ఆ భాషలో ఆర్జీ దాఖలు చేసుకోవాలి యీ నిబంధన ద్వారా భారతీయులకు నేటాల్ తలుపులు పూర్తిగా మూసివేసినట్లే తెలిసోతెలియకో నేను నేటాల్ ప్రభుత్వానికి అన్యాయం చేయకూడదనే ఉద్దేశ్యంతో పాఠకులకు ఒక్క విషయం తెలుపుతున్నాను. యీ చట్టం అంగీకరించబడక పూర్వం మూడు సంవత్సరాల నుంచి నేటాలులో ఏ భారతీయుడైనా ఉండివుంటే అతడు నేటాలు నుంచి భారత దేశంలోని మరే దేశంగాని వెళ్లవచ్చు. నేటాలుకు తిరిగి రావచ్చు. అతడు యూరప్ భాషనేర్వనక్కరలేదు. అతడు తన భార్య, మైనరు తీరని బిడ్డలతో పాటు నేటోలులో ప్రవేశించవచ్చు.

ఇదేగాక నేటాలులో వుండే గిర్‌మిట్ భారతీయుల మీద, స్వతంత్ర భారతీయుల మీద చట్టబద్ధమైన చట్ట బద్దంకాని పలు ఆంక్షలు విధించారు వాటన్నింటిలోకి పాఠకుల్ని దింపడం నాకు యిష్టం లేదు యీ పుస్తక మందలి విషయాన్ని తెలుసుకునేందుకు అవసరమైన వివరాలనే యిక్కడ పేర్కొంటేచాలని నా అభిప్రాయం దక్షిణాఫ్రికాయందలి అధినివేశరాజ్యాలలో నివశించే భారతీయుల చరిత్రను విస్తారంగా వివరించవచ్చుకాని అందుకు నేను పూనుకోవడంలేదు. అది యీ పుస్తకం ఉద్దేశ్యం కాదు