పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

375


14. నవంబరు ఈ వారం 227 మంది భారతీయులు జైలుకు వెళ్ళారు. వారిలో 64 మంది జోహన్స్‌బర్గుకు 97 మంది జర్మిస్టన్‌కు 60 మంది ప్రిటోరియాకు 6 మంది తదితర స్థానాలకు చెందిన భారతీయులు.

17 నవబంరు 53 మంది తమిళులు కేకలు వేస్తు పట్టుబడ్డారు. వాళ్లకు 7 రోజుల జైలు శిక్ష విధించారు.

22. నవంబరు కలకత్తాలో శ్రీ అబ్దుల్ జబర్ అధ్యక్షతన ఫత్యాగ్రహంలకు సానుభూతి తెలుపుతూ సభ జరిగింది

13 డిసెంబరు గాంధీగారు రెండు నెలల జైలుశిక్ష అనుభవించి విడుదల ఆయ్యారు

1909

9. జనవరి - డర్బనులో మర్క్యురీ పత్రికా ప్రతినిధి గాంధీ గారిని కలిశాడు. అతనికి, ట్రాన్స్‌వాల్‌కి చెందిన సుమారు 2000 మంది జైలుకు వెళ్ళి వచ్చారని గాంధీజీ చెప్పారు.

15 జనవరి గాంధీగారు నేటాలు నుంచి బాల్‌ట్రస్ట్ వెళ్లుతూ మూడో సారి అరెస్టు అయ్యారు. కొద్దివారాల తరువాత కేసుపెట్టి 3 మాసాలు శిక్ష విధించారు. అదే రోజున హామీదియా సొసైటీ ఉపాధ్యక్షుడు 65 ఏండ్ల వయస్సు గల శ్రీ డమర్జీసాభే, డేవిడ్ ఆర్నెస్ట్ డారలకు 3 నెలల శిక్ష విధించారు.

29 జనవరి క్రూగర్స్ డ్రాస్‌లో ఖోల్వడ్ కాన్ఫరెన్సు జరిగింది. పత్రాలు తీసుకోకూడదవి దుకాణాలు తెరవకూడదని నిర్ణయం గైకొన్నారు. జైలుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు.

6. ఫిబ్రవరి : ట్రాన్స్‌వాల్ యందలి హాస్కిన్ కమిటీ, భారతీయులకు మేలు చేయాలని లండన్ టైమ్పుకు జాబు పంపింది.

10. ఫిబ్రవరి : రోడీషియాలో అంగీకరించబడిన 'చట్టాన్ని బ్రిటిష్ చక్రవర్తి నిరాకరించాడు.

12 ఫిబ్రవరి : పారసీరుస్తుంజీ తదితర భారతీయులకు ఆరు మాసాల జైలు శిక్ష విధించారు.