పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/395

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
376
అనుబంధం - 1


6. మార్చి : తెల్లవాళ్లు బాక్స్‌బర్గ్, నార్‌వుడ్, బ్లూంపాంటీన్, బార్బర్టన్, క్రూగర్స్ డ్రార్స్‌లో లోకేషను స్థాపనకై ఉద్యమం ప్రారంభించారు.

10 . మార్చి : డెల్‌గోవాబే మార్గాన భారతీయుల్ని దేశ బహిష్కరణకు గురిచేసి ఇండియాకు పంపివేయడం ప్రారంభించారు.

12. మార్చి : ప్రిటోరియాలో శ్రీమతి పిళ్లె కేసులో గాంధీ గారిని బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చారు.

5, ఏప్రిల్ 14 సెప్టెంబరు నుంచి 17 మార్చి వరకు వ్రాసిన దస్తావేజుల బ్లూబుక్ ప్రభుత్వం ప్రచురించింది.

30 ఏప్రిల్ : శ్రీ కాఛలియా మరియు 18 మంది యితర సత్యాగ్రవులు శిక్ష అనుభవించి విడుదలయ్యారు.

4. మే :సత్యాగ్రహకైదీలకు జైళ్లలో నెయ్యి ఇవ్వడం ప్రారంభించారు.

24. మే గాంధీ గారికి మూడోసారి మూడు మాసాల జైలు శిక్ష విధించారు.

7. జూన్ : జర్మిస్టన్‌లో తెల్లవారి సభలో గాంధీ గారు సత్యాగ్రహ విధానం మీద మహత్తరమైన ప్రసంగం చేశారు.

16 జూన్ : జోహన్స్ బర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో శ్రీ ఎ.ఎం. కాఛలియా శ్రీహాజీ అబీబ్, శ్రీ బి.ఏ. చెట్టియార్ మరియు గాంధీగారలను ఇంగ్లాండు పంపాలనీ, శ్రీ ఎ.ఎం. కానూ, శ్రీ ఎన్.జి. నాయుడు, శ్రీ ఇ.యం. కుబాడియా, శ్రీ హెచ్.ఎస్. పోలక్‌ను భారత దేశం పంపాలని నిర్ణయించారు. యీ ప్రతినిధి బృందాలు బయలు దేరేందుకు ముందే శ్రీ కాఛలియా, శ్రీ కువాడియా శ్రీకానూ, శ్రీ చెట్టియార్‌ గారలను అరెస్టు చేశారు.

4. జూలై : జోహాన్స్ బర్గ్ జైలునుంచి విడుదల కాగానే జైల్లో అనుభవించిన కష్టాలవల్ల, యాతనల వల్ల శ్రీ నాగప్పన్ చనిపోయాడు.

16. జూలై : ముజకరి అనుస్టీమర్లో 14 మంది భారతీయుల్ని దేశాన్నుంచి . బహిష్కరించి పంపి వేశారు.

1 సెప్టెంబరు : బొంబాయి షరీఫ్ దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సంగ్రామాన్ని