పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/393

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
374
అనుబంధం - 1


30. జనవరి సత్యాగ్రహ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేశారు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం స్వేచ్ఛగా అనుమతి పత్రాలు తీసుకోమని భారతీయుల్ని కోరింది. అలా తీసుకుంటే ఖూనీ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పింది

10 ఫిబ్రవరి శ్రీ గాంధీగారు, శ్రీ తంబినాయుడు, కొందరు అనుచరులు ఏషియాటిక్ ఆఫీసు వైపుకు వెళ్లుతూ వుండగా గాంధీగారి మీద దాడి జరిగింది.

24. జూన్ : ప్రభుత్వం ఖూనీ చట్టాన్ని రద్దు చేసేది లేదని ప్రకటించింది అందువల్ల సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభమైంది. శ్రీ సారాబ్జీ అందరి కంటే ముందు నేటాలు నుంచి ట్రాన్స్‌వాలులో అడుగు పెట్టారు. జూలై 20వ తేదీన వాల్‌క్రస్ట్ అను మేజిస్ట్రేటు ఒక మాసం జైలు శిక్ష వారికి విధించాడు.

12. జూలై . 2000 అనుమతి పత్రాలు జోహన్స్ బర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో తగుల పెట్టబడ్డాయి.

22. జూలై : లార్డ్ సెల్ బోర్న్‌కు ప్రభుత్వాన్నుంచి తంతి అందింది. తద్వారా రోడీషియాలో ప్యాసు చేయబడిన కఠోరమైన ఏషియాటికి చట్టానికి బ్రిటిష్ చక్రవర్తి అనుమతి లభించదని తెలియజేయబడింది.

22. ఆగష్టు , ఐచ్ఛిక ప్రదేశ పత్రాల్ని చట్టబద్ధం చేసే చట్టం, యితర భారతీయులకు పత్రాలుయిచ్చే చట్టం రెండూ ట్రాన్స్‌వాల్ పార్లమెంటులో ప్యాసయ్యాయి.

30.. ఆగస్టు : ప్రిటోరియాలో జరిగిన బహిరంగ సభలో 200 ఐచ్చిక పత్రాలు తగుల బెట్టబడ్డాయి.

7. సెప్టెంబరు . గాంధీగారిని బాల్‌క్రస్ట్‌లో అరెస్టు చేశారు. ఒక వారం తరువాత కేసు బెట్టి వారికి 2 మాసాల కఠిన జైలు శిక్ష విధించారు.

9. నవంబరు . ఇవాళ నుంచి అయిదు రోజుల్లో 227 మంది భారతీయులు జైళ్లకు వెళ్ళారు. వారిలో హిందూ ముస్లిం వ్యాపారులు అధికంగా ' వున్నారు. 64 మంది జోహాన్స్ బర్గుకు 97 మంది జర్మిస్టన్‌కు, 60 మంది ప్రిటోరియాకు చెందిన భారతీయులు.