పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

367


రెండు కాలాల్లో ప్రకటించవచ్చు. అందలి ఒక నిబంధన భారత దేశపు స్త్రీపురుషుల వివాహాలకు సంబంధించినది భారత దేశంలో చట్టరీత్యా చేల్లే వివాహాలన్ని దక్షిణాఫ్రికాలో కూడా చెల్లుబాటు అవుతాయి. అయితే ఒక్కరికంటే మించి ఎక్కువ మంది భార్యలు వుంటే, వారంతా ఒకే సమయంలో చట్టరీత్యా భార్యలుగా అంగీకరింపబడరు యిది బిల్లు నందలి ఒక భాగం. తలకు మూడు పౌండ్ల పన్ను చెల్లింపును గురించి నిబంధన రెండవది గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన తరువాత దక్షిణాఫ్రికా యందు నివసించ తలచిన స్వతంత్ర భారతీయుడు ప్రతిఒక్కడూ తలకు 3 పౌండ్లు చొప్పున ప్రతి సంవత్సరం చెల్లించవలసిన పమ్న యిక చెల్లించవలసిన అవసరం లేదు. దక్షిణాఫ్రికాలో ప్రవేశించే భారతీయులకు యిచ్చే ప్రవేశ పత్రాలు, అనుమతిపత్రాలను గురించిన నిబంధన మూడవది. ఏ భారతీయుల దగ్గర యిట్టి పత్రాలు వున్నాయో, వారికి దక్షిణాఫ్రికాలో నివసించుటకు ఎటువంటి అధికారాలు వుండాలి అను విషయం యిందు వివరించబడింది. ఈ విషయం మీద యూనియన్ పార్లమెంటులో సుదీర్ఘ చర్చ వాడిగా వేడిగా జరిగింది.

చట్టంలో పేర్కొనవలసిన అవసరం లేదని భావించిన విషయాలను గురించి జనరల్ స్మట్సుకు నాకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో పేర్కొనడం జరిగింది. వాటిలో క్రింద తెలిపిన విషయాలు వున్నాయి. కేప్‌టౌనులో విద్యావంతులైన భారతీయులు ప్రవేశించు హక్కును ధృవీకరించుట, ప్రత్యేక అనుమతి పొందిన విద్యావంతులైన భారతీయులను దక్షిణాఫ్రికాలోనికి ప్రవేశించ నిచ్చుట, గత మూడు సంవత్సరాల (1914 నకు పూర్వం) లో దక్షిణాఫ్రికాలోనికి ప్రవేశించిన విద్యావంతులైన భారతీయుల స్థాయిని అనగా తరగతిని నిర్ణయించుట. ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు గల వ్యక్తికి, తన మిగతా భార్యలను కూడా దక్షిణాఫ్రికా తెచ్చుకొనుటకు అనుమతించుట. యీ విషయాలన్నీ జనరల్ స్మట్స్ వ్రాసిన జాబులో చోటు చేసుకోవడమే గాక మరో విషయం "ఇప్పుడు అమలులో , వున్న , చట్టాల విషయంపై