పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/387

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
368
పోరాటం సమాప్తం


యూనియన్ ప్రభుత్వం కోరిన కోరుతున్న ప్రకారం యీ చట్టాల అమలు న్యాయ బద్ధంగా, వారు అనుభవిస్తున్న అధికారాలను పరిరక్షిస్తూ, జరగవలెను' ' అని కూడా పేర్కొనడం జరిగింది. యీ జాబు 1914 జూన్ 30వ తేదీన నాకు వ్రాయబడింది. అదేరోజున జనరల్ స్మట్సుకు నేను సమాధానం వ్రాస్తూ “ఈనాటి తేదీతో గల మీ జాబు నాకు అందింది. మీరు ఓపికతోను, సుహృద్భావంతోను నా మాటలన్నీ విన్నందుకు మీకు కృతజ్ఞుణ్ణి భారతీయులకు సంతృప్తి కలిగించే చట్టం (ఇండియన్ రిలీఫ్‌బిల్) ద్వారానే గాక, మన యిరువురి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో యిక సత్యాగ్రహ పోరాటం సమాప్త మైంది. 1908లో యీ సంగ్రామం ప్రారంభమైంది. యీ సంగ్రామం కారణంగా భారతజాతికి పెద్ద దుఃఖం కలగడమే గాక ధనం కూడా అపారంగా నష్టపోవలసి వచ్చింది. యీ సంగ్రామం వల్ల ప్రభుత్వం కూడా చింతాక్రాంతం కావలసి వచ్చింది.

“నా కొంత మంది భారతీయ సోదరుల కోరికలను గురించి మీకు తెలుసు. వేరు వేరు ప్రాంతాలలో వ్యాపారానికి సంబంధించిన అనుమతి పత్రాల చట్టాల్లో మార్పులు కోరుతున్నారు. ఉదాహరణకు ట్రాన్స్‌ వాల్ యందలి గోల్డ్‌లా ట్రాన్స్‌వాల్ టౌన్‌షిప్ ఆక్టు, 1885 నాటి ట్రాన్స్‌వాల్ చట్టమందలి నిబంధన 3 నందు ఏమీ మార్పు జరగలేదు. వాటిలో మార్పు అవసరం. భారతీయులకు అక్కడ నివసించుటకు సంపూర్ణమైన అధికారం లభించాలి. భూముల మీద యాజమాన్యం లభించాలి. వ్యాపారం చేసుకొనుటకు చట్టరీత్యా వీలు కల్పించాలి. వాటిని పేర్కొనకపోవడం వల్ల భారతీయులకు అసంతృప్తిగా వున్నది. ఒక ప్రాంతాన్నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి కూడా అనుమతి లభించకపోవడం వల్ల అసంతృప్తి ఎక్కువగా వున్నది. యిప్పుడు చట్టంలో భారతీయుల వివాహం విషయమై కల్పించబడిన సదుపాయం యింకా ఎక్కువగా లభించాలని భారతీయులు కోరుతున్నారు. యీ విషయాలనన్నింటినీ సత్యాగ్రహ సంగ్రామ పత్రంలో చేర్చబడాలని అంతా కోరుతున్నారు. అయితే నేను వారి యీ కోరికను అంగీకరించలేదు.