పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

361


తికమకలన్నీ నాకు బాగా తెలుసు. నా దగ్గరగల బలవత్తరమైన సాధనం సత్యాగ్రహుల సహనశక్తి, త్యాగనిరతి, నిజాయితీలే, సత్యాగ్రహం ప్రారంభించేముందే తాము ఎన్నో కష్టాలు పడాలని, మృత్యువుకు సైతం సిద్ధపడాలని సత్యాగ్రహులు తెలుసుకున్నారు. అందుకు వారంతా సిద్ధపడ్డారు. ఆట్టిస్థితిలో పడ్డకష్టాల్ని రుజూ చేస్తే కలిగే లాభం ఏమిటి? పగ తీర్చుకుందామనే కోరిక సత్యాగ్రహికి అసలు కలుగకూడదు. అట్టి పరిస్థితులు వచ్చినప్పుడు సత్యాగ్రహి ప్రశాంతంగా వుండాలి. ప్రధాన మైన సమస్య కోసం సత్యాగ్రహి ప్రయత్నం చేయాలి నల్ల చట్టాల్ని రద్దు చేయించడమే ప్రధాన విషయం. అవి రద్దు అయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు యిక మీగతా విషయాలలో పడటం అనవసరం పోరాటంలో రాజీపడుటకు రెండు పక్షాలు సిద్ధపడినప్పుడు, సత్యాగ్రహులు మౌనం వహిస్తే అది అమోఘంగా పని చేస్తుంది నాయీ తర్కంతో వ్యతిరేకిస్తున్నవారిలో ఎక్కువమందిని సంతృప్తి పరిచాను. అందువల్ల చట్టం ద్వారా పడిన కష్టాలను రుజూ చేయాలనే పట్టును సడలించుటకు నిర్ణయించుకున్నాము




49

ఉత్తర ప్రత్యుత్తరాలు

ప్రాధమిక ఒడంబడిక విషయమై జనరల్ స్మట్సుకు నాకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. 1914 జనవరి 21 వ తేదీ నాటి జాబులో క్రింది వివరం వ్రాశాను.

"మేము చేసిన ప్రతిజ్ఞ వల్ల మీరు చెప్పిన ప్రకారం కమీషన్ ఎదుట సాక్ష్యం యిచ్చి వారికి సహకరించలేము. మా ప్రతిజ్ఞను గురించి మీకు తెలుసు. మీరు దీన్ని గౌరవిస్తున్నారని మాకు తెలుసు సాక్ష్యం యిచ్చి సహకరించకపోయినా మరో విధంగా కమీషన్‌కు సహకరిద్దామని కనీసం కమీషన్ చేసేపనికి అడ్డంకులు కలిగించవద్దని నా దేశ ప్రజలకు చెబుతాను. మా జాతీయ సమస్యల్ని గురించి మాతో సలహా సంప్రదింపులు జరపాలనే