పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/379

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
360
ప్రాథమిక ఒడంబడిక


వారు మీకు అనుకూలురు కాకపోయినా 3 పౌండ్ల పన్నును రద్దు చేయుటకు ఆయన అంగీకరిస్తే పని తేలిక అయిపోతుంది. మా కష్టాలు మావి ఒక్క నిమిషం సమయం కూడా మాకు చిక్కడం లేదు. మీ సమస్యల్ని త్వరగా పరిష్కరిస్తాం. మీ కోరికల్ని అంగీకరించాలనే నిర్ణయానికి వచ్చాం కాని కమీషన్ అంగీకరించకపోతే మేము వాటిని పూర్తి చేయలేము. మీ పరిస్థితి నాకు తెలుసు కమీషన్‌లో మీ ప్రతినిధిని నియమించకపోతే మీరెవ్వరూ కమీషను ముందు సాక్ష్యం యివ్వరు. యిష్టం లేకపోతే సాక్ష్యం యివ్వకండి కాని ఎవరైనా సాక్ష్యం యిస్తామని ముందుకువస్తే మీరు వాళ్ళను ఆపకండి. కమీషన్ పని సవ్యంగా సాగనివ్వండి. ఆందాకా సత్యాగ్రహాన్ని ఆపండి అలాచేస్తే మీకు లాభం కలుగుతుంది. నాకు శాంతి లభిస్తుంది. సమ్మె చేస్తున్న భారతీయ కార్మికులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. మీరు కమీషన్ ఎదుట సాక్ష్యం యివ్వము అని అంటున్నారు కనుక యీ ఆరోపణను ఎలా రుజూ చేస్తారో చెప్పండి అయితే యిది మీరే ఆలోచించుకోవలసిన విషయం

ఇవీ స్మట్సు నోటవెలువడిన మాటలు. వారు చెప్పిన మాటలకు నామనస్సు అనుకూలంగా మారింది. సమ్మె చేస్తున్న కార్మికులపై రక్షకభటులు, వార్డర్లు కఠినంగా దౌర్జన్యం చేశారని పెద్దస్థాయిలో ప్రచారం చేశాం. కాని కమీషన్ను బహిష్కరిస్తున్నాం కనుక మా ఆరోపణను రుజూ చేయలేము గదా! ధర్మ సంకటం ఏర్పడింది. రక్షక భటులు, వార్డర్లు కలిసి భారతీయులపై చేసిన దౌర్జన్యాలను రుజూ చేయడం అవసరమని కొందరి అభిప్రాయం. కమీషన్ ఎదుట సాక్ష్యం యివ్వకపోయినా దౌర్జన్యం చేసిన వారిపై తీవ్రమైన ఆరోపణలు చేద్దాం యిక గతిలేక వాళ్లు మనమీద మాననష్టం దావా కోర్టులో వేస్తారు. అక్కడ వాళ్ల దౌర్జన్యాల్ని రుజూ చేద్దాం అని వారు అన్నారు. కాని యీ పద్ధతిని నేను అంగీకరించలేదు. కమీషను ప్రభుత్వం యొక్క భావాలను వ్యతిరేకిస్తుందని ఆశించకూడదు. మాననష్టపు దావా వరకు వ్యవహారాన్ని తీసుకువెళ్లితే దానితోనే వేగవలసి వస్తుంది. చివరికి కలిగే లాభం ఏమీ వుండదు. వకీలును గనుక పరువునష్టం దావాలో వుండే