పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/381

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
362
ఉత్తర ప్రత్యుత్తరాలు


సిద్ధాంతాన్ని మీరు అంగీకరించారు. కనుక మేము పై విధానం అవలంబిస్తాం యింతేగాక కమీషన్ పని సాఫీగా జరుగుటకు, క్రొత్త చట్టాలు ప్యాసు అయ్యే సమయంలో ప్రభుత్వానికి యిబ్బంది కలుగ చేయని పద్ధతిన సత్యాగ్రహాన్ని నిలుపదల చేయమని కూడా మా వాళ్లకు సలహా యిస్తాను వైస్రాయి పంపిన సర్ బెంజిమన్ రాబర్ట్‌సన్‌కు కూడా సహాయం చేయమని నా దేశబంధువులకు చెబుతాను

జైళ్లలో వున్నప్పుడు, సమ్మె చేస్తున్నప్పుడు మేము అనుభవించిన కష్టాలు, దుఃఖాలను గురించి మా మీద జరిగిన దౌర్జన్యాలను, మేము చేసిన ప్రతిజ్ఞ కారణం వల్ల రుజూ చేయుటకు సిద్ధపడటం లేదని తెలియజేస్తున్నాను సత్యాగ్రహ సిద్ధాంతం ప్రకారం మేము పడిన కష్టాలను, అనుభవించిన దుఃఖాలను గురించి ఆరోపణలు చేయము అందుకు ప్రతీకారం కూడా కోరము. యీ విషయమై మేము వహిస్తున్న మౌనానికి మా దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలు లేవని మాత్రం భావించవద్దని మనవి చేస్తున్నాను మా స్థితిని కూడా గుర్తించి అర్థం చేసుకోమని మిమ్ము కోరుతున్నాను మేము సత్యాగ్రహాన్ని ఆపుతూ వున్నాము గనుక, యిప్పుడు జైళ్లలో మ్రగ్గుతున్న సత్యాగ్రహులనందరినీ విడుదల చేయాలి యీ సందర్భంలో మా కోరికలు ఏమిటో మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను.

1. మూడు ఫౌండ్ల పన్ను రద్దు చేయాలి

2 హిందువులు మహమ్మదీయులు మొదలుగా గల మతాల ప్రకారం జరిగిన వివాహాలనన్నింటిని చట్టబద్ద మని అంగీకరించాలని

3. విద్యావంతులైన భారతీయుల్ని యీ దేశంలోకి ప్రవేశించనీయాలి

4. ఆరెంజ్ ఫ్రీస్టేటు విషయమై జరిగిన నిర్ణయాలలో సంస్కరణలు జరగాలి.

5 భారతీయులకు యిప్పుడు కల అధికారాలకు ఏ విధమైన నష్టం వాటిల్లదని యిప్పటి చట్టాలు అమలు చేసే సమయంలో హామీ యివ్వాలి