పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

348

కఠిన పరీక్ష


కష్టం మీద బెరూలం దగ్గర కార్మికులను సమ్మె చేయకుండా ఆపారు అయినా కార్మికులంతా పనికి పోలేదు. కొందరు భయపడి దాక్కున్నారు ఎవ్వరూ వెనుకంజవేయలేదు.

ఇక్కడ ఒక ఘట్టాన్ని గురించి వ్రాయాలి. బెరూలంలో చాలా మంది కార్మికులు పని విరమించి బైటికి వచ్చి వేశారు. అధికారులు ఎంత ప్రయత్నించినా వారిలో ఒక్కరు కూడా పనికి వెళ్లలేదు. జనరల్ ల్యుకిన్ తన సైన్యంతో అక్కడ సిద్ధంగా వున్నాడు. కార్మికులపై కాల్పులు జరపమని ఆర్డరు యివ్వడానికి సన్నద్ధమైనాడు. యింతలో కీ. శే. పారసీ రుస్తుంగారి చిన్న కొడుకు బహాదుర్ దసారాబ్జీ డర్భను నుంచి అక్కడికి వచ్చాడు. ఆ పిల్లవాడికి 18 ఏండ్ల వయస్సు, అతడు జనరల్ ఎక్కి కూర్చున్న గుర్రం కళ్లెం పట్టుకొని “మీరు యీ జనం మీద కాల్పులు జరపడానికి వీలు లేదు. నేను యిప్పుడే వీళ్లందరికీ నచ్చచెప్పి శాంతియుతంగా పనికి పంపించే బాధ్యత వహిస్తాను" అని బిగ్గరగా అరిచాడు. జవరల్ ల్యుకన్ యీ యువకుణ్ణి చూచి, అతడి మాటలు విని ముగ్ధుడై పోయాడు. సరేనని ఆయువకుడికి అవకాశం యిచ్చాడు. సారాబ్జీ కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ప్రశాంతంగా నచ్చ చెప్పాడు. కార్మికులు విషయం తెలుసుకొని మారుమాట్లాడకుండా పనులకు వెళ్లిపోయారు. యీ విధంగా ఒక నవయువకుడి సమయస్ఫూర్తి, నిర్భయత్వం ప్రేమభావం వల్ల వేలాది మంది కార్మికుల హత్యలు ఆగిపోయాయి. .

నిజానికి కార్మికుల మీద ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఆత్యాచారాలు పూర్తిగా చట్టవిరుద్ధం. న్యూకేసల్‌కు చెందిన గనుల కార్మికుల మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలు పైకి చట్టానికి అనుకూలంగా వున్నాయే గాని వాస్తవానికి అవి సరియైనవి కావు. ఆ కార్మికుల్ని సమ్మె చేసినందుకు కాక అనుమతి పత్రాలు లేకుండా ట్రాన్స్‌వాలులోకి ప్రవేశించారనే అపరాధం మోపి అరెస్టు చేశారు. కాని నేటాలుకు నైఋతి మరియు వాయువ్య దిక్కుల యందు సమ్మె చేయడం అపరాధంగా పరిగణించారు. అయితే చట్టరీత్యా కాక ప్రభుత్వం యొక్క సత్తాచూచుకొనీ అలా చేశారు. చివరికి ప్రభుత్వ