పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

349


సత్తాయే చట్ట రూపం దాలుస్తుందన్న మాట. బ్రిటిష్ వారి చట్టంలో రాజు ఎన్నడూ తప్పు చేయడు. అను సామెత ఒకటి వున్నది. కాని వాస్తవానికి ప్రభుత్వం యొక్క శక్తియే చట్టమవుతుంది. యీ దోషం ప్రభుత్వాలన్నీ చేస్తాయి. వాస్తవానికి యీ విధంగా చట్టాన్ని మరిచిపోవడం దోషంగా భావించరు. అప్పుడప్పుడు చట్టాన్ని పట్టుకు కూర్చోవడమే దోషంగా భావించబడుతుంది. ఏ ప్రభుత్వమైనా ప్రజల హితంకోరి పని చేస్తూ వుంటే దాన్ని అలా చేయనీయకుండా ఆపివేసే చట్టాలు నష్టం కలిగిస్తాయి. అట్టి నియంత్రణను నిర్లక్ష్యం చేయడం ధర్మబద్ధం అవుతుంది. అది వివేకం అనిపించుకుంటుంది. నిరంకుశంగా వ్యవహరించే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకారి కాలేదు. దక్షిణాఫ్రికాలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించుటకు అవకాశం లేదు. కార్మికులు అనాది నుంచి సమ్మె చేసే తమ అధికారాన్ని ఉపయోగించుతూనే ఉన్నారు. సమ్మె చేసే కార్మికులు ఉపద్రవాలు చేయరని తెలుసుకొనుటకు అనేకమార్గాలు వున్నాయి. వాళ్ల సమ్మె వల్ల చేయవలసిన పని మహా అయితే ప్రభుత్వం విధించిన మూడు పౌండ్ల తల పన్నును రద్దు చేయడమే. శాంతి ప్రియుల విషయంలో ప్రభుత్వం కూడా శాంతి యుతంగానే వ్యవహరించాలి. ఒక్క విషయం మాత్రం నిజం. దక్షిణాఫ్రికా యందలి రాజ్యశక్తి ప్రజలకు ఉపయోగకారికాదు. అక్కడి ప్రభుత్వం శ్వేత జాతీయుల అధికారాల్ని రక్షించడం కోసమే వున్నదని చెప్పవచ్చు. అది భారతీయులకు అనుకూలంకాదు. వ్యతిరేకం. అందువల్ల ఏకపక్షంగా వ్యవహరించే నిరంకుశ ప్రభుత్వం మంచిది కాదు. క్షమించతగినది కాదు.

అందువల్ల నా దృష్టిలో అధికారంలో వున్నవాళ్ళు యిక్కడ అధికార శక్తిని దుర్వినియోగ పరిచారు. యీ విధంగా ప్రభుత్వశక్తిని దేనికోసం దుర్వినియోగ పరుస్తారో అది ఎన్నటికీ విజయం పొందదు. అప్పుడప్పుడు క్షణిక సాఫల్యం లభించినట్లు అనిపించినా, అది స్థిరంగా వుండదు. దక్షిణాఫ్రికా యందలి కార్మికుల మీద నిష్కారణంగా కాల్పులు జరిపిన ప్రభుత్వం ఆరుమాసాల తరువాత మూడు పౌండ్ల తలపన్నును రద్దుచేయక తప్పలేదు. దాన్ని