పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

347


అరెస్టుల్ని గురించిన వార్తలు మెరుపులా దేశమంతటా వ్యాప్తమయ్యాయి. యీ రెండు దిక్కుల యందు గల వేలాది మంది కార్మికులు తమ పనులు మాని బయటికి వచ్చేశారు. వారిలో కొందరు యీ పోరాటం చాలా కాలం సాగుతుందని భావించి తమ ఆస్థిపాస్తులు అమ్ముకున్నారు. అట్టి పేద కార్మికులకు భోజనం ఎవరు పెడతారు? నేను జైలుకు వెళ్ళక పూర్వమే కార్మికుల్ని ఎక్కువ సంఖ్యలో పోరాటంలోకి చేరనీయవద్దని, వాళ్లు యిక్కట్ల పాలవుతారని అనుచరులకు చెప్పాను కూడా. గనుల కార్మికులు పాల్గొంటే పోరాటం త్వరగా విజయం సాధిస్తుందని నాకు తెలుసు. అయితే యిందు పెద్ద ప్రమాదం కూడా వున్నది. 60 వేల మంది కార్మికులు ఒక్కుమ్మడిగా పనులు మానివేస్తే వారిని పోషించడం సాధ్యమా? యింత మందిని సంగ్రామంలో ముందుకు నడపాలంటే మన దగ్గర సాధనాలు వున్నాయా? యింత మందిని అదుపులో వుంచగల దళనాయకులు మన దగ్గర వున్నారా? యింత మందిని పోషించడానికి మన దగ్గర డబ్బు పువృదా? యింత ముందిని ప్రోగు చేశాక జరిగే హింసాత్మక ఉపద్రవాల్ని అరికట్టగలమా? అందుకు అవసరమైన మంది మార్బలం మన దగ్గర వున్నదా? యీ ప్రశ్నలకు సమాధానం లేదు అనే. అయినా ముంచుకు వచ్చిన వరదమ ఎవరు ఆపగలరు? కార్మికులంతా తామంత తామే పనులు మానివేశారు. అయితే ఆయా కార్మికులు వున్న చోట్ల స్వయం సేవకులు కూడా తమంత తామే ఆవిర్భవించారు. యిది గొప్ప విశేషం. .

ఇక యూనియన్ ప్రభుత్వం తుపాకీ విధానాన్ని చేతబట్టింది. కార్మికుల్ని సమ్మె చేయకుండా అరికట్టడానికి పూనుకున్నది. సమ్మె చేస్తున్నవారి మీదకు గుర్రాల్ని పరుగెత్తించింది. వాళ్లు పని చేసే గనుల దగ్గరికి బలవంతంగా వాళ్లను చేర్చింది. కార్మికులు కొంచెం అల్లరికి దిగినా తుపాకుల తూటాలతో చంపి వేయడానికి సిద్ధపడింది. వారిలో కొందరు పని చేయం అన్ని భీష్మించారు. కొందరు రాళ్లు రువ్వారు. కొన్ని చోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. చాలా మంది గాయపడ్డారు. నలుగురైదుగురు, చవిపోయారు. కూడా. అయినా కార్మికుల ఆవేశం చల్లారలేదు. స్వయం సేవకులు ఎంతో,