పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340

జనమంతా జైళ్లలో

1913 నవంబరు 10వ తేదీ సత్యాగ్రహుల దళం ఉదయం 9 గంటలకు బెల్‌ఫోర్ చేరింది. అక్కడ మూడు స్పెషల్ రైళ్లు సత్యాగ్రహుల్ని అరెస్టుచేసి నేటాలు చేర్చుటకు సిద్దంగా నిలబడివున్నాయి. కాని జనం పట్టుబట్టారు. “గాంధీని పిలిపించండి. వారు సరేనంటే మేమంతో రైళ్లు ఎక్కుతాం. అంతవరకు ఎక్కం" అని వాళ్లు చెప్పారు. అయితే వారి యీ పట్టు సరియైనది కాదు. వాళ్లు తమ పట్టువదలకపోతే మా పందెం దెబ్బ తినేది. సత్యాగ్రహల తేజస్సు తగ్గిపోయేది. జైళ్లకు వెళ్లడానికి, గాంధీకి సంబంధం ఏమిటి? సైనికులు తమ సైన్యాధిపతిని ఎన్నుకోగలరా? ఒక సైన్యాధికారి మాట వింటామని పట్టుపట్టడం సాధ్యమా? శ్రీ చమనీ యాత్రాదళ సభ్యులకు నచ్చచెప్పుటకు శ్రీ పోలక్ మరియు కాఛలియా సహాయాన్ని కోరాడు. వాళ్లిద్దరూ ఎంతో కష్టం మీదయాత్రా దళలక్ష్యం జైలుకు వెళ్లడమేకదా! ప్రభుత్వం అరెస్టు చేసేందుకై ముందుకొచ్చింది కనుక సత్యాగ్రహులు అరెస్టు అయిపోవాలి. అలా జరిగితే మన సజ్జనత్వం బయటపడుతుంది. విజయం ఖాయం అవుతుంది. గాంధీగారి కోరిక కూడా యిదే" అని చెప్పి వాళ్లను ఒప్పించారు. సత్యాగ్రహులంతా అంగీకరించి రైళ్లలో కూర్చున్నారు.

నన్ను మేజిస్ట్రేటు ఎదుట కోర్టులో హాజరుపరిచారు. మిగతా విషయాలు నాకు ఏమీ తెలియవు. నేను మరో పర్యాయం కేసు వ్యవధిని పెంచమని, జమానతు మీద విడుదల చేయమని కోరాను గతంలో రెండు కోర్టులు యిందుకు అంగీకరించి వ్యవది యిచ్చాయని కూడా తెలియజేశాను. మా యాత్ర చివరిభాగంలో పున్నదవి, అది పూర్తి అయ్యేంతవరకు గడువు యివ్వమని కోర్టును కోరాను. మా దళసభ్యుల్ని ప్రభుత్వం అరెస్టు చేసినాసరే, లేనియెడల వాళ్లందరినీ టాల్‌స్టాయ్ ఫారంలో వదిలి వచ్చుటకు గడువు యివ్వమని చెప్పాను. కాని కోర్టు నా వివతిని. అంగీకరించలేదు. అయితే నా కోరికను ప్రభుత్వానికి వెంటనే తెలియజేయుటకు కోర్టు అంగీకరించింది. ఈ సారి నన్ను డండీ తీసుకువెళ్లాలి. అక్కడి కోర్టులో, నేను గిర్‌మిటియా కార్మికుల్ని గనుల్లో పనిచేయడం మాసమని ప్రోత్సహించాననే అభియోగం మోపబడింది. అందుకోసం నన్ను ఆ రోజునే రైల్లో డండీ చేర్చారు.