పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

339

నా హద్దు నాకు తెలుసు. నేను మౌనం వహించాను యాత్రాదళసభ్యులకు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసు. నన్ను బండి ఎక్కించి గుర్రాన్ని అదిలించారు. కొద్ది నిముషాల్లో యాత్రాదళానికి దూరమై పోయాను.

అధికారికి తెలుసు అది మాప్రదేశం మొత్తం 2000 - మంది సత్యాగ్రహులం అక్కడవున్నాం మేము అహింసాపద్ధతిన ముందుకు నడుస్తున్నాం అతడు సమన్లు పంపి అరెస్టు చేసినా మేము తిరుగుబాటు చేయము ఆ స్థితిలో మీరు ఖైదీ సుమా అని అతడు నాకు చెప్పవలసిన అవసరం లేదు నన్ను మాట్లాడనిస్తే ప్రభుత్వం పని కూడా తేలిక అయ్యేది. కాని ప్రభుత్వాధికారి నైజం మారుతుందా? మా అహింసా విధానాన్ని గురించి చాలా మంది ప్రభుత్వ అధికారులకు తెలిసిపోయింది. జైలు మాకు అంకుశంకాదని, మాకు దు:ఖ హేతువుకాదని, అది మాకు ముక్తి ద్వారమని అందరూ గ్రహించారు. అసలు మమ్మల్ని అరెస్టు చేయడం వాళ్లకు సులభం కూడా, మమ్మల్ని అరెస్టు చేసేముందు మా సాయం కోరడం, వెంటనే మేము వారి ఆజ్ఞను శిరసావహించడం, అందుకు మాకు కృతజ్ఞత తెలపడం వారికి అలవాటు అయిపోయింది. పాఠకులకు పలురకాల అధికారుల వ్యవహారం యీ ప్రకరణాల్లో బోధపడుతుందని భావిస్తున్నాను

ఇద్దరు అధికారులు బండిమీద అటుదిప్పి యిటుదిప్పి చివరికి హెడల్‌బర్గ్ పోలీసుస్టేషన్‌కు నన్ను చేర్చారు. రాత్రి అక్కడే గడిచింది.

యాత్రా దళాన్ని తీసుకొని శ్రీ పోలక్ ముందుకు సాగారు. అంతా గ్రేలిగ్ స్ట్రాండు చేరారు. అక్కడ భారత వ్యాపారులు పెద్ద సంఖ్యలో నిలబడి వున్నారు. త్రోవలో వారిని సేఠ్ అహమద్ ముహమ్మద్ కాఛలియా మరియు సేఠ్ అమద్ ఖాయాత్‌గారలు కలిశారు. ఏమి జరుగనున్నదో వాళ్లకు తెలుసు. నా వెంట వచ్చిన యాత్రా దళ సభ్యుల నందరిని అరెస్టు చేయుటకు ఏర్పాటు జరిగిపోయింది. శ్రీ పోలక్ ఆ తరువాత డర్బన్ చేరి ఓడ పట్టుకొని ఇండియా వెళదామని భావించారు. కాని మనం అనుకున్నట్లు అంతా జరగదుకదా!