పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశం - 2


ఆ విధంగా .............. రించారు. అటువంటి పరిణామం కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయం జవరల్ స్మట్సుకు తప్పక చెప్పండి. వారు మూడు పౌండ్ల తలవన్ను చట్టాన్ని రద్దు చేస్తే యీ యాత్రను ఆపుచేస్తాం. కేవలం చట్టాన్ని వ్యతిరేకించడం మాకు యిష్టం లేదు. కాని తప్పనిసరి అయి ఆ పనిచేస్తున్నాము. జనరల్ నా యీ మాటను అంగీకరించరా? అని అడిగాను. మరుక్షణమే "జనరల్ స్మట్స్ మీతో ఏ విధమైన సంబంధం పెట్టుకోదలచలేదు మీరు ఏం చేస్తారో చేసుకోండి" అంటూ పక్షసు టక్కున పెట్టి వేశారు.

అట్టి సమాధానమే లభిస్తుందని అనుకున్నాను. అయితే శిష్టత చూపరమోనని మాత్రం భావించాను. సత్యాగ్రహ ఏర్పాట్లు జరిగిన తరువాత జనరల్ స్మట్సుతో నాకు ఆరు సంవత్సరాల రాజకీయ పరిచయం ఏర్పడింది. అయితే శిష్టతగా అతడు వ్యవహరించినా ఉబ్బిపోయే స్థితిలో నేను లేను: కనుక అతడి యీ ఆశిష్ట ప్రవర్తనను చూచి నీరసపడిపోలేదు. నాకర్తవ్య మార్గం తిన్నగా కండ్ల ముందును నాకు కనబడుతూ వున్నది. మరునాడు (1913 నవంబరు 6) నిశ్చితసమయానికి (ప్రొద్దున ఆరున్నర గంటలకు} మేము ప్రార్ధన చేశాం. దేవుని పేరట దేవుని మీద భారం వేసి యాత్ర ప్రారంభించాం. మా యాత్రాదళంలో 2037 మంది పురుషులు, 127 మంది స్త్రీలు, 57 మంది బాలలు వున్నారు.




44

ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశం - 2

ఈ విధంగా దాన్ని సంఘం అనండి, లేక యాత్రాదళం అనండి, సరిగ్గా నిశ్చిత సమయానికి చార్ల్స్‌టౌనుకు బయలు దేరింది. చార్ల్స్‌టౌనుకు ఒక మైలు దూరాన బాక్స్‌రస్ట్ అను ఒక చిన్న కాలువ వున్నది. ఆ కాలువను దాటడం అంటే బాక్స్‌రస్ట్‌లో లేక ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించి నట్టే ఆకాలువ ఒడ్డున దగ్గర గుర్రపు రౌతులు పోలీసు దళం వారి దగ్గరికి వెళ్లాను. వెళ్లే ముందు