పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

333


నేను సైగ చేసిన తరువాత మీరు సరిహద్దు దాటమని మన వాళ్లకు చెప్పాను. నేను పోలీసులతో . మాట్లాడుతూ వుండగానే మన వాళ్లు వేగంగా ముందుకు సాగారు. అంతా కాలువను దాటారు. వాళ్లు ట్రాన్స్‌వాల్ సరిహద్దులోకి ప్రవేశించారు. గుర్రపురౌతులు వారిని చుట్టి చేశారు. అయితే మన యాత్ర బృందం సభ్యులు పోలీసులు ఆపితే ఆగలేదు. నిజానికి మమ్మల్ని పట్టుకోవాలని పోలీసులు భావించలేదు. నేను వెంటనే మనవాళ్లందరికి చెప్పి శాంత పరిచి వరుసగా పంక్తుల్లో నడవమని సర్దిచెప్పారు. అయిదారు నిమిషాల్లో అంతా సర్దుకున్నారు. మా ప్రయాణం ట్రాన్స్‌వాల్‌లో ఆరంభం అయింది.

బాక్స్‌రస్ట్ నందలి తెల్లవారంతా రెండు రోజుల క్రితమే ఒక సభజరిపి, మమ్మల్ని బాగా బెదిరిస్తూ మాట్లాడారు. భారతీయులు గనుక ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశిస్తే గుండ్ల వర్షం కురిపిస్తామని కూడా కొందరు అన్నారు. ఆ సభకు శ్రీ కెలిన్ బెక్ తెల్లవారికి నచ్చ చెప్పుటకు వెళ్లారు. కాని ఎవ్వరూ వారి మాట వినలేదు. కొందరు తెల్లవాళ్లు ఆయనను కొట్టడానికి లేచారు. శ్రీ కెలిన్‌బెక్ స్వయంగా ఫైల్మాను. ఆయన ఒక శాండో దగ్గర కసరత్తు నేర్చుకున్నారు. వారిని భయపెట్టడం సాధ్యంకానిపని ఒక తెల్లవాడు వారిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. “నేను శాంతి ధర్మాన్ని స్వీకరించాను. అందువల్ల నేను నీతో యుద్ధం చేయను. నన్ను కొట్టదలుచుకుంటే కొట్టవచ్చు. వేను యీ సభలో మాట్లాడితీరతాను. మీరు తెల్లవారినందరినీ సభకు రమ్మని ఆహ్వానించారు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. శ్వేత జాతీయులంతా నిర్దోషుల్ని కొట్టి హింసించాలని భావించడం లేదు.. కనీసం నా వంటి ఒక శ్వేత జాతీయుడు. మీరు భారతీయులపై చేస్తున్నవన్నీ అబద్ధపు ఆరోపణేనని నొక్కి చెబుతున్నాను. మీరు అనుకున్నట్లు భారతీయులు చేయదలచుకోలేదు. మీ రాజ్యం వాళ్లకు అక్కరలేదు. మీతో యుద్ధం చేయదలచడం లేదు. మీ. దేశాన్ని భారతీయులతో నింపి వేయదలచడం లేదు. వాళ్లు న్యాయం చేయమని కోరుతున్నారు. ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశిస్తున్న భారతీయులు తమ మీద విధించబడిన మూడు పౌండ్ల తల