పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

331


మందులు అక్కడ సేకరించుకోవచ్చునని భావించాం. రోగుల్ని వెంట తీసుకువెళ్లకుండా త్రోవ యందలి గ్రామాలల్లో వదిలి ముందుకు సాగాలని భావించాము.

డబల్‌రొట్టె, పంచదార తప్ప మాదగ్గర యింకేమీలేదు. ఎనిమిది రోజులకు సరిపడరొట్టె ఎలా సేకరించడం? యాత్రీకులకు రోజు రొట్టెల్ని అందజేయాలిగదా! ప్రతిమజిలీ దగ్గర మాకు రొట్టెలు అందించే బాధ్యత ఒకరు వహించారు. ఎవరు వహిస్తారు? అక్కడ గ్రామాలకు, నగరాలనుంచే డబల్ రొట్టె చేరుతుంది. అట్టిస్థితిలో పట్టణాలనుంచి రైలు స్టేషనుకు డబల్, రొట్టె అందజేసే వ్యవస్థ చేయవలసి వచ్చింది. చార్ల్స్‌టౌనులో తెల్లవాని పేదల రొట్టెల దుకాణం వున్నది. అతడు ప్రతి రైలు స్టేషను దగ్గర రొట్టె అందజేస్తానని మాట యిచ్చాడు. అతడు మమ్మల్ని మోసం చేయలేదు. ఎక్కువ ధర తీసుకోలేదు. మంచి పిండిని వినియోగించాడు. ఎంతో నిజాయితీగా రొట్టెల్ని రైలుస్టేషన్లకు పంపాడు. రైల్వే ఫనివారు. ఎంతో నిజాయతీగా రొట్టెల్ని మాకు అందజేశారు. మాకోసం ప్రత్యేక సౌకర్యాలు చేశారు. మేమెవ్వరికీ అపకారం చేయమనీ, కష్టాలు దు:ఖాలు సహించి బాధలు తీర్చుకోవడమే మా లక్ష్యమని అందరికీ బాగా తెలిసిపోయింది. అందువల్ల మా చుట్టు ప్రక్కల వాతావరణమంతా పరిశుద్దమవడమేగాక, ప్రజల హృదయాలలో వుండే ప్రేమ అను సుగుణాన్ని జాగృతం చేసింది. హిందువులం, ముస్లిములం, క్రైస్తవులం, పారసికులం అంతా అన్నదమ్ములుగా కలిసిమెలిసి వున్నామని కూడా అందిరికీ తెలిసిపోయింది.

మా యాత్రకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. అప్పుడు వేను మళ్లీ యింకోసారి ప్రభుత్వంతో మాట్లాడదామని ప్రయత్నించాను. జాబులు, తంతులు పంపాను. వాళ్లు నన్ను అవమానించినా సరే, టెలిఫోనులో వారితో మాట్లాడదామని కూడా నిర్ణయించాను. చార్ల్స్‌టౌను నుంచి ప్రిటోరియాకు ఫోను వ్యవస్థ వున్నది. నేను తిన్నగా జనరల్ స్మట్సుకు పోను చేశాను. అతను కార్యదర్శి లైనులో దొరికాడు. “జనరల్ స్మట్సుకు చెప్పండి. మా యాత్రకు ఏర్పాట్లన్నీ జరిగాయి. భాక్స్‌రస్ట్. యందలి. తెల్లవారు ఉత్తేజితులైనవారు. బహుశా వాళ్లు మా ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు.