పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

326

గనుల యజమానులను కలుసుకున్న తరువాత


కూడా చెప్పి వేశాను. జూలూల తిరుగుబాటు, బోయర్ల యుద్ధంలో నాకు కలిగిన అనుభవాలు యిప్పుడు నాకు బాగా సహకరించాయి. వెంట అవసరానికి మించిన బట్టలు తెచ్చుకోవద్దని, ఏ బరువూ వెంట పెట్టుకోవద్దని, త్రోవలో కలిసిన తెల్లవాడు మనల్ని తిట్టినా, కొట్టినా సహించాల్సిందేకాని వాడిమీద తిరగబడకూడదని, పోలీసులు అరెస్టు చేస్తే అరెస్టు అయిపోవాలని, నన్ను అరెస్టు చేసినా వారు ముందుకు సాగితీరాలని, మొదలుగా గల విషయాలన్నీ వారికి చెప్పి వేశాను. నన్ను అరెస్టు చేస్తే తరువాత వాయకత్వం వహించేవారి పేరు, వారిని అరెస్సు చేస్తే తరువాతి నాయకుని పేరు వరుసగా ప్రకటించాను.

నా సూచనల్ని అంతా విన్నారు.. మా యాత్రదళం క్షేమంగా చార్ల్స్‌టౌన్ చేరుకున్నది. అక్కడి భారతీయ వ్యాపారులు ఎంతో సహాయం చేశారు. తమ గృహాలను కూడా ఉపయోగించుకోమని అన్నారు. మసీదు. యందలి మైదానాన్ని వంటలు చేసుకోమని యిచ్చారు. త్రోవలో యిచ్చే భోజనం వేరు, మజిలీలో యిచ్చే భోజనం వేరు కనుక వంట పాత్రలు అవసరమయ్యా యి. వ్యాపారులు పాత్ర లిచ్చారు. బియ్యం, పప్పు ఉప్పు అన్ని యిచ్చారు.

చార్ల్స్‌టౌన్ చిన్న గ్రామం అక్కడి జనం పంఖ్య 1000. ఇన్ని వేల మంది ఎక్కడ వుంటారు? స్త్రీలను, పిల్లలను గృహాల్లో వుంచాము. ఇక మిగతా వాళ్లంతా మైదానంలోనే మకాం చేశారు.

అక్కడ తీయని సంస్కరణలతో బాటు చేదు, అనుభవాలు కూడా మాకు కలిగాయి. అక్కడి ఆరోగ్యశాఖాధికారి డా॥బ్రిస్కో యింత జానాన్ని చూచి హడలిపోయాడు. అయితే అతడు.. కఠోర చర్యలేమీగైకొనలేదు, నన్ను కలిసి అవసరమైన సహాయం చేయమని కోరాడు. ఆంగ్లేయులు మూడు విషయాలను గురించి శ్రద్ధ వహిస్తారు. భారతీయులు ఆ విషయాల్ని పట్టించుకోరు. (1) నీటి స్వచ్ఛత. (2) రోడ్ల పరిశుభ్రత (31 పాయిఖానా దొడ్ల పారిశుధ్యం ఈ మూడింటిని గురించిన అనేక సూచనలు చేసి, జనానికి చెప్పి జాగ్రత్త పడమని...మరీ, మరీ చెప్పాడు. . అన్నింటినీ ..అంగీకరించాను. నాకు శాంతి లభించింది...,