పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

325


నేను గమనించాను. ఈ విషయంలో వాళ్లు ప్రభుత్వంతో మంతనాలు చేస్తున్నారని నాకు తెలుసు. డర్బను వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు రైళ్లలో మూడో తరగతిలోనే నా ప్రయాణం చేశాను. రైల్వే అధికారులు, గార్డులు, అంతా నాతో మంచిగా వ్యవహరించారు. అంతా నా దగ్గరికి వచ్చి సమ్మెను గురించి వివరంగా, సమ్రంగా అడుగుతూ వున్నారు. వారంతా కార్మికులకు అనుకూలంగా వున్నారు. నా మీద ప్రేమ చూపించారు. నాకు సౌకర్యాలు కల్పిస్తామని ముందుకు వచ్చారు. కాని నేను మంచిగా, నమ్రంగా అన్నింటినీ నిరాకరించాను. వారు చూపించిన సుహృద్భావానికి కృతజ్ఞుణ్ణే కాని దాన్ని కొనడం నాకు యిష్టం వుండదు. చదువురాని, పేద కార్మికులు యింత ధైర్యంగా వున్నారంటే అందరికి ఆశ్చర్యం కలిగింది. స్థిరత్వం, దృఢత్వం అనేవి సుగుణాలు, శతృవులపై కూడా అవి తమ ప్రభావం చూపుతాయి.

న్యూకేసిల్‌కు తిరిగి వచ్చాను. కార్మికుల ప్రవాహం అపరిమితంగా యింకా వస్తూనే వున్నది. సమ్మె చేస్తున్నవారికి పరిస్థితిఅంతా సవివరంగా చెప్పాను. యజమానులు చేసిన బెదిరింపులు కూడా చెప్పాను. తిరిగి వెళ్లతలుచుకుంటే వెళ్లమని చెప్పి, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల్ని కూడా తెలియ చేశాను. జైళ్లను గురించి, తిండి, తిప్పల్ని గురించిన కష్టాలు కూడా వివరించి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా కార్మికులంతా ఏకోన్ముఖంగా "విన్ను విరిగి మీద పడ్డా మేము భయపడం. మీరే మాకు అండ. మీరు మా ప్రక్కన వున్నంత వరకు మాకు భయం లేదు. విజయం మనదే" అని చెప్పి వేశారు.

ఇక మాకు వేరే మార్గం లేదు. ఒకనాటి సాయంత్రం, రేపు ఉదయమే యాత్ర బయలుదేరుతుందని చెప్పాను. (28 అక్టోబరు 1913) దారిన నడుస్తున్నప్పుడు పాటించవలసిన విధులు చదివి వినిపించాను. 5 లేక 6 వేలనుందిని సంభాళించడం శులభమైన పని కాదు. వాళ్ల సంఖ్య మొత్తం ఎంతో నాకు తెలియదు. వాళ్ల పేర్లు, చిరునామాలు. నా దగ్గర లేవు. ఎంత మంది వుంటే అంతే నాకు సంతోషమని చెప్పాను. ప్రతివ్యక్తికి యిచ్చే రొట్టే పంచదారను గురించి చెప్పి అంతకంటే ఎక్కువ యిచ్చుటకు శక్తి లేదని