పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/346

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు తెలియని సమస్య ఎదురైనది
327
సత్యాగ్రహ చరిత్ర


ఆ నియమాల్ని మనవాళ్ల చేత పాటింప చేయడం సాధ్యమా? అయితే మనవాళ్లు ఆ పమల్ని సులభం చేశారు. సేవ చేసేవాడు. జనం మీద అధికారం చలాయించకుండా వుండే పని తేలికగా జరుగుతుంది. సేవకులు కాయకష్టం చేయాలి. ఊడ్చడం దగ్గరి నుంచి అన్ని పనులు చేయాలి. మనం పని చేయకుండా మీరు చేయమని చెబితే ఎవరు చేస్తారు. అంతా సర్దార్లే అయితే పని చేసే దెవరు? అందువల్ల అంతా సేవాధర్మం నిర్వహిస్తే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి.

శ్రీ కెలెన్ బెక్ ముందే చార్ల్స్‌టౌన్ చేరారు. కుమారి శ్లేసిన్ కూడా వచ్చారు. ఆమె సేవ, జాగ్రత్త, తెలివితేటలు మొదలగువాటిని గురించి ఎంత వ్రాసినా చాలదు. కీ. శే. పి.కె. నాయుడు క్రిస్టోఫర్ పేర్లు జ్ఞపకం వచ్చాయి. ఇంకా చాలా మంది వున్నారు. అంతా కలిసి పనిని సులభం చేశారు. కూరలు బాగా లభించాయి. వాటిని వేరే ఉడికించకుండా పప్పులో వేసేసారు. రాత్రింబవళ్లు వంటపని సాగుతూనే వున్నది. వచ్చిన వారికి లేదు అనుమాట వినబడలేదు. న్యూకేసిల్‌లో ఎవరు ఉంటారు? అందువల్ల కార్మికులంతా తిన్నగా చార్ల్స్‌టౌన్ చేరుకుంటున్నారు.

ప్రజల సహనం, ఓపిక చూస్తే సాక్షాత్తు ఆపరమేశ్వరుని స్వరూపమే వారిలో కనబడింది, వంటచేసే వారికి నేనే - పెద్దను, పప్పులో నీళ్లు ఎక్కువ. బియ్యంలో నీళ్లు ఎక్కువ. ఏవంటా సరిగా వుండేది కాదు. కాని ఎవ్వరు మారుమాట్లాడకుండా సహించి వాటిని తిన్నారు. అంటే అంతా పరమేశ్వరుని కృపయే. వంట చేయడం తేలికేకాని, వడ్డించడం అమిత కష్టం. ఆ పని నేను చేసేవాణ్ణి జనం నన్ను చూసి ఏమీ అనలేక పాపం ఊరుకునే వారు. స్త్రీలకు కొద్దిగా వడ్డిస్తే చురచుర నావంక తలని నా స్థితిని గమనించి వెళ్లి పొయేవారు. ఆ దృశ్యాన్ని జీవితంలో, ఎన్నటికీ మరచి పోలేను. నా దగ్గర ఆహార పదార్థం తక్కువగా వున్నది. బోజనం చేసే వారి సంఖ్య ఎక్కువగా వున్నది. ఏం చేయను అని వారితో అనగానే మారుమాట్లాడకుండా వెళ్ళిపోతూ, వుండేవారు. నేను చెప్పిన మాటలు, విని సంతోషం అని ముఖ్యంగా స్త్రీలు అనడం జీవితంలో మరిచిపోలేను.