పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

324

గనుల యజమానులను కలుసుకున్న తరువాత


"మేము అధికారులంకాము" అని వాళ్ళు జవాబిచ్చారు.

అధికారులు కాకపోయినా మీరు తలచుకుంటే ఎంతో చేయగలరు. కార్మికుల కోసం మీరు వాదించగలరు. మీరు మూడు పౌండ్ల తల పన్ను రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరితే తక్షణం అది రద్దు అయిపోతుంది. మిగతా శ్వేత జాతీయులకు కూడా మీరు చెప్పవచ్చు" అని అన్నాను.

“అసలు మూడు పౌండ్ల పన్నుకు, గనుల యజమానులమైన మాకు సంబంధం ఏమిటి? గనుల యజమానులు కార్మికులను యిక్కట్ల పాలు చేస్తూ వుంటే మాకు వ్యతిరేకంగా అర్జీ దాఖలు చేయండి"

“కార్మికులకు సమ్మె చేయడం తప్ప మరో మార్గం కనబడలేదని నా అభిప్రాయం. గనుల యజమానుల కోసమే మూడు పౌండ్ల పన్ను ప్రభుత్వం విధించింది. కార్మికుల సేవల్ని యజమానులు కోరుతున్నారు. కాని వారికి స్వాతంత్ర్యం యిద్దామని కోరడం లేదు. అట్టి అన్యాయపు పన్నును రద్దు చేయమని కార్మికులు కోరితే అందు నాకేమీ తప్పు కనబడటం లేదు. అది యజమానులకు వాళ్లు చేస్తున్న అన్యాయం ఎంత మాత్రం కాదు అని నా అభిప్రాయం అని చెప్పాను.

“అయితే మీరు పనులలో చేరమని కార్మికులకు చెప్పరా?"

“నేను చెప్పలేను"

“అందుకు పరిణామం ఏమిటో మీకు తెలుసా?"

“తెలుసు, నా బాధ్యత నాకు తెలుసు."

"అవును, మీదేంబోతుంది? ఈ సమ్మె వల్ల కార్మికులకు కలిగిన నష్టాన్ని మీరు ఆరుస్తారా? తీరుస్తారా?"

"కార్మికులు బాగా ఆలోచించి, కష్టనష్టాల్ని బేరీజు వేసుకొని యిందుకు పూనుకున్నారు. స్వాభిమానానికి తగిలే దెబ్బకంటే పెద్ద నష్టం , మరోకటి వుంటుందని నేను అనుకోవడం లేదు. అసలు ముఖ్యమైన యీ మూల విషయాన్ని కార్మికులు గ్రహించారు. అందుకు నేను సంతోషిస్తున్నాను."

మా సంభాషణ యీ విధంగా జరిగింది. ఆ సంభాషణంతా యిప్పుడు జ్ఞాపకం లేదు. తమ వాదన బలంగా లేదని యజమానులు గ్రహించడం