పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

323


నమిలారు. కానీ గుండెను రాయిచేసుకోక తప్పలేదు మీలో తిరిగి గనులకు వెళ్ల దలిచిన వెళ్లిపోవచ్చునని స్పష్టంగా చెప్పివేశాను. అందుకు. ఎవ్వరూ యిష్టపడలేదు.

వికలాంగుల్ని రైల్లో పంపాలని నిర్ణయించాం. మిగతా జనమంతా కాలినడకను బయలుదేరుటకు సిద్ధపడ్డారు. రెండు రోజుల్లో చేరదామని చెప్పేసరికి అంతా సంతోషించారు. పాపం లాజరనుకు, వారి కుటుంబీకులకు కొద్దిగా విశ్రాంతి లభిస్తుందని అంతా భావించారు. న్యూకేసల్‌కు చెందిన తెల్లవాళ్లు అంటురోగాలు వ్యాపిస్తాయని హడలిపోయి, వాటి నివారణకు ప్రయత్నాలు ప్రారంభించారు. మా నిర్ణయం తెలియగానే వారందరికీ ఉరట చేకూరింది.

ప్రయాణానికి అంతా సిద్ధపడుతూ వుండగా గనుల యజమానులు నన్ను కలుసుకోడానికి సిద్ధంగా వున్నారని ఒక మనిషి నా దగ్గరకి వచ్చాడు. అతని వెంట నేను డర్బను వెళ్లాను. అయితే ఆ కధకు కొత్త ప్రకరణం అవసరం.




42

గనుల యజమానులను కలుసుకున్న తరువాత

గనుల యజమానుల ఆహ్వానాన్ని అందుకొని నేను డర్బన్ వెళ్లాను. అక్కడ తెల్ల యజమానులపై కార్మికుల సమ్మె ప్రభావం పడిందని తెలుసుకున్నాను. అయితే తెల్ల యజమానులు నాతో మాట్లాడటం వల్ల ప్రయోజనం కలుగుతుందని నేను భావించలేదు. కాని సత్యాగ్రహికి వినమ్రత అవసరం, అవతల వాళ్లు ఎంత అవమానించినా భరించాలి. కోపం తెచ్చుకోకుడదు ఆత్మ శక్తి మీద నిలబడాలి. అవతలి వారికి కూడా నచ్చ చెప్పి వారి హృదయాల్ని మార్చుటకు ప్రయత్నించాలి.

కనుకనే నేను అంగీకరించి వెళ్లాను. అక్కడ వాతావరణం వేడిగా వున్నది. నా మాటలు వినకుండానే యజమానుల ప్రతినిధి చాలా ప్రశ్నలు వేశాడు అన్నింటికి సమాధానం యిచ్చాను చివరికి "ఈ సమ్మెను ముగింప చేయడం మీ చేతిలో పని అని అన్నాను."