పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

కార్మికుల ప్రవాహం

పది, యాబై మంది కాదు, కార్మికులు వందలాది సంఖ్యలో వున్నారు వేల సంఖ్య అని కూడా చెప్పవచ్చు. వాళ్లందరికీ ఇళ్లు ఎక్కడ నుండి తీసుకురావడం? వారందరికీ తిండి ఎలా పెట్టడం? భారతదేశాన్ని నేను యింత వరకు ఏమీ అడగలేదు. అక్కడి నుంచి డబ్బేమీ అందలేదు తరువాత ధనవర్షం కురిసిన మాటనిజమే దక్షిణాఫ్రికా యందలి వ్యాపారులు భయపడ్డారు. బహిరంగంగా నాకు సాయం చేయడానికి వెనుకంజవేయ సాగారు. వాళ్ల వ్యాపార లావాదేవీలు గనుల తెల్లజాతి యజమానులతోను, తెల్ల వ్యాపారులతోను వున్నాయి కనుక బహిరంగంగా నాకు అండగా నిలవలేరు కదా! న్యూకేసిల్ వెళ్లినప్పుడు యీ వ్యాపారుల గృహాల్లో వుండేవాడిని. కాని యీసారి నేను వాళ్లకు ఆశ్రమ కలిగించలేదు మరో చోట వుండటానికి ఏర్పాటు చేసుకున్నాను

ట్రాన్స్‌వాల్ వచ్చిన సత్యాగ్రహదళ మహిళలంతా ద్రావిడ ప్రదేశానికి సంబంధించిన వాళ్లు. వాళ్లు ఒక క్రైస్తవ కుటుంబంతో బాటు వున్నారు అది మధ్య తరగతి కుటుంబం కొద్ది వ్యవసాయ భూమి, మూడునాలుగు గదుల యిల్లు వారికి వున్నది వారి యింట్లో వుండాలని అనుకున్నాను ఇంటి యజమాని పేరు శ్రీ డి|| లాజరస్ బీదవాడికి ఒకరి భయం ఎందుకుకుంటుంది? వారంతా గిర్‌మిటియా కార్మికుల కుటుంబానికి సంబంధించిన వారే మూడు పౌండ్ల పన్ను వారంతా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. పడేబాధ లేమిటో వాళ్లకు బాగా తెలుసు కనుకనే వాళ్లకు కార్మికులంటే సానుభూతి ఎక్కువ. నాకు స్వాగతం ఆ కుటుంబీకులంతా పలికారు. సామాన్యంగా నేను ఎవరి యింట్లో వున్నా ఆ యింటి వారికి ఏ మాత్రం తీరిక వుండదు. జనం తాకిడి ఎక్కువ కదా! అయితే యీ పర్యాయం నాకు స్వాగతం చెప్పిన వారికి అన్ని కష్టాలే. ధన నష్టం, ఆస్థినష్టం. ఒకటేమిటి అంతా నష్టమే యిన్ని కష్టాలు ధనిక వ్యాపారులు పడలేరు కదా! ఈ విషయమంతా నాకు తెలుసును కనుక లాజరస్ కుటుంబీకుల్ని యిబ్బంది పెట్టడానికి నేను యిష్టపడలేదు. శ్రీ లాజరస్ జైలుకు వెళ్లగలడు. ధన నష్టం భరించగలడు. కాని తనకంటే బీదవారైన గిర్‌మిటియా కార్మికుల కష్టాలు చూచి ఎలా