పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సత్యాగ్రహ చరిత్ర

321


భరించగలడు? తన కుటుంబ మందలి స్త్రీలు భారతీయ కార్మికుల మేలు కోసం జైలుకు వెళ్లడం కండ్లారా చూచాడు. తన కర్తవ్య నిర్వహణకోసం యీసారి. లాజరస్ నన్ను తన యింటికి ఆహ్వానించాడు. వానింట్లో అడుగు పెట్టానో లేదో వారిల్లు దర్మసత్రంగా మారిపోయింది. ఇల్లంతా జనమే. చుట్టు ప్రక్కలా జనమే. 24 గంటలు పొయ్యి మండుతూనే వున్నది. లాజరస్ భార్యకి వంటవని తప్ప మరో పనిచేయడానికి తీరిక చిక్కలేదు. అయినా భార్యా, భర్తల ముఖంలో ఎప్పుడు చూచినా చిరునవ్వే వారి ముఖంలో కోపాన్ని నేను చూడలేదు.

పాపం లాజరస్ అంతమంది కార్మికులకు ఆహారం ఎలా అందజేస్తారు. కార్మికులకు "మీ సమ్మె చాలా కాలం సాగుతుంది. యజమానులు యిచ్చిన కొంపలు వదిలివేయండి. అమ్మడానికి వీలైన సామాన్లు అమ్మివేయండి. మిగిలిన సామాను కొఠార్లలో దాచండి. యజమాన్లు ఆసామాను ముట్టుకోరు. కాని విపరీతమైన ద్వేషంతో మీ సామాను, బైటపారవేయవచ్చు. అందుకు సిద్దపడండి. నేను బయట పున్నంత వరకు మీతో వుంటాను. మీతో బాటు తిండి తింటాను. కానీ మీరు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడితేనే నిలబడి వుండండి. చాలా కాలం ఉద్యమం సాగినా చివరికి విజయం మనకు తప్పక లభిస్తుంది" అని చెప్పాను. “మీలో ఎవరైనా తట్టుకోలేక తిరిగి వెళ్లి పనిలో చేర తలిస్తే తప్పక చేరండి. అలా చేరిన వారిని మిగతా వారెవ్వరూ అవమానించకండి. హింసింధకండి" అని కూడా చెప్పాను. ఎవ్వరూ అలా చేసినట్లు నాకు సమాచారం అందలేదు. కార్మికులంతా నేను చెప్పినట్లు చేసి భార్యాపిల్లలతో, కట్టుబట్టలతో, మూటాముల్లె నెత్తిన పెట్టుకొని నా దగ్గరికి రాసాగారు. నా దగ్గర, నేల తప్ప మరేమీ లేదు. అయితే వర్షాకాలం, ఎండాకాలం కాకపోవడం నిజంగా అదృష్టమే. భోజనం విషయంలో వ్యాపారులు సాయం చేస్తారని భావించాను. న్యూకేసిల్‌కు చెందిన వ్యాపారులు, పలు పాత్రలు ధాన్యం వస్త్రాలు వగైరా పంపి సహాయం చేశారు. ఇతర పట్టణాలనుంచి పప్పు కూరలు, పండ్లు, పంచదార, తేనె మొదలుగా గల వస్తువులన్నీ వర్షరూపంలో కురువసాయి. అవసరాన్ని మించిన వస్తువులు