పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

295


చక్కగా వ్యక్తీకరించారు. గోఖలేగారి ప్రసంగం. సంక్షిప్తంగా పరిపక్వతతోకూడుకున్న ఆలోచనలతో వున్నది. భారతీయులు చాలా ప్రసన్నులయ్యారు. తన ప్రసంగంతో గోఖలే తెల్లవారి మనస్సులను దోచుకున్నారు. దక్షిణాఫ్రికాలో అడుగిడిన రోజే వివిధ రకాల ప్రజల మనస్సులను దోచుకున్నారని దీని అర్థం,

కేఫ్‌టౌన్ నుంచి గోఖలే గారు జోహాన్స్‌బర్గ్ వెళ్ళ వలసి వుంది.. రెండు రోజుల రైలు ప్రయాణం. సత్యాగ్రహసమర కురుక్షేత్రం ట్రాన్స్‌వాల్, కేఫ్‌టౌన్ నుండి జోహాన్స్‌బర్గ్ వెళ్లేటప్పుడు ట్రాన్స్‌వాల్ పరిహద్దులో వున్న పెద్ద స్టేషన్ క్లార్క్స్ డార్స్‌లో భారతీయులు పెద్ద సంఖ్యలో వున్నారు. ఈ రెండింటి మార్గమధ్యంలో వున్న పోచే ఫస్ట్రూమ్ క్రూగర్స్‌డార్స్ అన్ని చోట్ల కూడా గోఖలే గారు సభలల్లో పాల్గొనవలసి వుండటంతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేయబడింది. అన్ని పట్టణాల్లోనూ అక్కడి మేయర్లు సభాధ్యక్తులు. ఏ స్టేషన్లోనూ రైలు ఒక గంటకంటే ఎక్కువ సేపు ఆగలేదు. మారైలు సరైన సమయానికి జోహాన్స్‌బర్గ్ చేరుకుంది. ఒక్క నిముషం కూడా ఆలస్యం కాలేదు. స్టేషన్లో ప్రత్యేకమైన కంబళ్ళు వేయించటం జరిగింది, . ఒక వేదిక కూడా తయారు చేయించాం. జోహాన్స్‌బర్గ్ మేయర్ శ్రీ ఎలిన్ ఇంకా యితర ఆంగ్లేయులు కూడా సభలో వున్నారు. గోఖలే అక్కడ వున్నపుడు వారు తన కారును వారి ఉపయోగార్థం యిచ్చేశారు. సన్మాన పత్రం గోఖలేగార్కి స్టేషన్లో యివ్వటం జరిగింది. అక్కడి గనుల నుండి తీసిన బంగారంతో చేసిన హృదయాకారపు ఫలకంపై సన్మాన పత్రం వ్రాసి వుంది. దాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన ప్రత్యేకమైన చెక్క రోడేషియన్ టేకులో అమర్చటం జరిగింది. చక్కపై భారతదేశంలో వున్న తాజ్‌మహల్ తక్కిన అందమైన ప్రదేశాల దృశ్యాలు చెక్కబడి వున్నాయి. గోఖలే గారిని పరిచయం చేయటం, సన్మానపత్రం చదవటం. దానికి సమాధానం చెప్పటం తక్కిన జ్ఞాపికలను స్వీకరించటం - అంతా యిరవై నిముషాలలోపలే జరిగింది. సన్మాన పత్రం బహు చిన్నది. అయిదు నిముషాలలోనే దాన్ని చదవటం పూర్తయింది. గోఖలే గారి సమాధానమూ అయిదు నిముషాల్లో ముగిసింది. స్వయం సేవకుల ఏర్పాటు