పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

గోఖలే యాత్ర - 1


ఎంతో పకడ్బందీగా వుంది. ఎక్కువ మంది. లేకపోయినా హుందాగా కార్యక్రమం జరిగింది. బైట ఎక్కువమంది చేరివున్నా, లోపలికి వచ్చేందుకు బైటికి వెళ్లేందుకు ఎవరికీ యిబ్బంది కలుగలేదు.

శ్రీ కెలన్ బెక్‌కు చెందిన ఒక అందమైన కుటీరం జోహాన్స్‌బర్గ్ నుండి అయిదు మైళ్ళ దూరంలో ఒక గుట్టమీద వుంది. అందులో గోఖలేగారీ బస ఏర్పాటు చేయబడింది. అక్కడి నుంచి కనిపించే దృశ్యాలు. అక్కడ నెలకొని వున్న ప్రశాంత వాతావరణం. నిరాడంబరంగా వున్నా కళాత్మకత వెల్లివిరిసే ఆ కుటీరం, యివన్నీ గోఖలే గారికి చాలా నచ్చాయి. అందరినీ కలిసేందుకు నగరంలో ఏర్పాట్లు జరిగాయి. దీని కోసం ఒక ప్రత్యేక కార్యాలయం అద్దెకు తీసుకున్నాం. అందులో ఒకటి గోఖలేగారి విశ్రాంతి గది. రెండవది ఆహ్వానితులతో మాట్లాడేందుకు మూడవ గది వచ్చినవారు కూర్చునేందుకై కేటాయించబడ్డాయి జోహాన్స్‌బర్గ్‌లోని కొందరు సుప్రసిద్ధులైన గౌరవనీయులైన పెద్దలతో వ్యక్తిగతంగా కలిసేందుకు సైతం గోఖలే గారిని మేము తీసుకొని వెళ్ళాం. అక్కడి ప్రముఖ ఆంగ్లేయుల ప్రత్యేక సభ కూడా ఒకటి ఏర్పాటు చేయబడింది. దీనివల్ల అక్కడి వారి దృక్కోణం గురించి గోఖలే గారికి అవగాహన అయ్యే అవకాశం కలిగింది. ఇంతే కాక జోహాన్స్‌బర్గ్‌లో వారి గౌరవార్థం ఒక పెద్ద విందు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దానికి నాలుగు వందల మందిని ఆహ్వానించాము. ఆహ్వానితులలో 150 మంది ఆంగ్లేయులు భారతీయులు ఒక గిన్నీ ఖరీదు చేసే టికెట్టు తీసుకుని రావలసి వుంటుంది. విందు ఏర్పాట్లు జరిగాయి. శాకాహార భోజవం. మత్తు పదార్థాలు పూర్తిగా నిషిద్ధం. వంటలు స్వయం సేవకులే తయారు చేశారు. ఈ విషయాలన్నింటినీ మాటల్లో వ్రాయాలంటే చాలా కష్టం. దక్షిణాఫ్రికాలోని మన హిందూ ముస్లిం సోదరులకు అస్పృశ్యత అంటే ఏమిటో తెలియదు. వారు ఒకేచోట కూర్చొని భోజనం చేస్తారు. శాకాహారులైన భారతీయులు వారు. అలవాటును రక్షించుకుంటున్నారు. భారతీయులలో కొందరు క్రైస్తవులు కూడా వుండేవాళ్ళు, తక్కిన భారతీయులలో. లాగే వారితోను నాడు గాథ పరిచయం వుండేది. వాళ్ళలో చాలా వరకు గిర్‌మిటియా కార్మికులు