పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


వారి వద్దకు ఎలా చేర్చటం? ఎలాగో ఏర్పాటు చేశాం. ఆఖరికి గోఖలేగారు ఒక్కమాట కూడా నన్ననలేదు. కానీ వారి ముఖం చూచి అర్థం చేసుకున్నాను. మేమంతా కింద నేలమీదే తివాచీ పరుచుకుని పడుకుంటామని తెలియగానే వారు కూడా చాపతీసి వేయించి నేలమీదే పరుపు వేయించుకున్నారు. ఆ రాత్రి నేను చాలా పశ్చాత్తాపపడ్డాను. గోఖలే గారికి ఒక అలవాటుండేది దానిని నేను దురలవాటు అని అంటాను. వారు తమ నౌకరుతో పేవ చేయించుకునేవారు. కానీ యీ యాత్రలో ఏ నౌకరూ రాలేదు. శ్రీ కెలన్ బెక్ నేనూ వారి పాదాలు ఒత్తుతామని చాలాసార్లు అభ్యర్ధించాము. కానీ వారు మమ్మల్ని తమ పాదాలు తాకేందుకు సైతం అనుమతించలేదు. పైగా సగం కోపం, సగం నవ్వు కలిపి "దుఃఖము అసౌకర్యము అనుభవించటానికి మీరు మాత్రమే పుట్టారనీ, మీ ద్వారా సుఖము సౌకర్యము పొందేందుకు మేము పుట్టామని మీరు అనుకుంటూ వుండవచ్చు. దీనికి శిక్ష యీ రోజు పూర్తిగా అనుభవించాలి. మీరు నన్ను తాకటం కూడా నా కిష్టం లేదు. మీరేమో శౌచ క్రియలకు యింటి నుంచి చాలా దూరంగా వెళ్తారా? నాకు మాత్రం యిక్కడే కమోడ్ ఏర్పాటు చేస్తారా? ఎందుకని? నేను ఎంత కష్టాన్నైనా సహిస్తాను. మీ యీ గర్వాన్ని ఆణచి తీరుతాను" అని అన్నారు. వారి యీ మాటలు వజ్రకఠోరంగా మాకు అనిపించాయి. కెలన్ బెక్ నేనూ యిద్దరమూ చాలా భిన్నమనస్కులయ్యాము. ఈ మాటలంటున్నప్పుడు వారి ముఖంపై చిరునవ్వు వుండటమే మాకు ఓదార్పు. తెలిసీ తెలియక అర్జునుడు కృష్ణునికి ఎన్నో యిబ్బందులు కలిగించి వుంటాడు. కానీ కృష్ణుడు అవన్నీ గుర్తుంచుకుని వుంటాడా? మాసేనా భావాన్ని గోఖలే గారు బాగా గుర్తుంచుకున్నారు. కానీ మా చేత సేవ చేయించుకునే అవకాశమే వారు మాకు యివ్వలేదు. మోంబాసా నుంచి వారు నాకు ప్రేమ పూర్వకమైన వుత్తరం వ్రాశారు. అది నా హృదయంపై అంకితమై పోయింది. మా ఆశ్రమానికి వచ్చి వారు చాలా కష్టపడ్డారు. కానీ వారి సేవ చేసుకునే భాగ్యం మాకు చివరి దాకా కలుగ జేయలేదు. తినుబండారాలు మేం చేసినవి తినకపోతే ఏం చేయగలిగే వారో? రెండవ రోజు వారు స్వయంగా విశ్రాంతి