పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

279


కేవలం ఆహారంలో మార్పులు నీటి ప్రయోగంతో నయమయ్యాయి. కానీ రెండుసార్లు నేనూ అనారోగ్యం పాలయ్యాక యిలాంటి చికిత్సలను చేయటంలో ధైర్యాన్ని కోల్పోయాను.

మా టాల్‌స్టాయ్ ఆశ్రమం నడుస్తున్నప్పుడే స్వర్గీయ గోఖలే దక్షిణాఫ్రికా వచ్చారు. వారి యాత్రను వర్ణించటానికో ప్రత్యేక ప్రకరణం కావాలి. కానీ ఒక చేదైన ఒక మధురమైన అనుభవాన్ని నేనిక్కడే చెబుతాను. ఆశ్రమంలో మేమెలాంటి జీవితాన్ని గడుపుతూన్నమో యీ పాటికి పాఠకులకు కొంత అవగతమయ్యే వుంటుంది. అక్కడ బల్ల లేక పరుపు లాంటి వస్తువులేవీ పుండేవి కావు. కానీ గోఖలే గారీ కోసం ఒక మంచం తెప్పించాం. వారికి పూర్తిగా ఏకాంతం కలిగేందుకు తగిన గదులు ఆశ్రమంలో లేవు. కూర్చునేందుకు విద్యాశాలలో వున్న బెంచీలు తప్ప వేరే పరంజామా మా వద్ద లేదు. ఇలాంటి స్థితిలోనూ గోఖలే వంటి వారిని ఆశ్రమానికి తీసుకురావాలన్న ఆశను చంపుకోవటం ఎలా? టాల్‌స్టాయ్ ఆశ్రమాన్ని చూడకుండా ఆయన వుండగలరా? గోఖలే గారి శరీరం ఒక్కరాత్రి కోసం అసౌకర్యాలను తట్టుకొనగలదనీ, స్టేషన్ నుండి ఆశ్రమం వరకు దాదాపు 1 1/2 మైలు దూరం నడిచి రాగలరవీ నేను అనుకున్నాను. నేను ముందే వారినడిగాను. సహజమైన సరళ స్వభావం కారణంగా ముందువెనుకలాలోచించక వారూ నాపై గల విశ్వాసంతో ఏర్పాట్లకు సరేనన్నారు. నా అదృష్టం కొద్దీ ఆరోజు వర్గం కూడా పడింది. వున్నట్లుండి ఏర్పాట్లలో మార్పు చేయటం నాకు సాధ్యమయ్యే పని కాదు. అలా నా అజ్ఞానంతో కూడుకున్న ప్రేమ వల్ల వారికి నేను కలిగించిన కష్టాన్ని జీవిత పర్యంతమూ మరచిపోలేను. ఇంత పెద్ద శ్రమను వారి శరీరం భరించలేకపోయింది. వారికి జలుబు చేసింది. భోజనం చేసేందుకు వంటింటి దాకా కూడా వారిని తీసుకుని వెళ్ళటం కష్టమై పోయింది. కెలన్‌బెక్‌గారి గదిలో వారిని వుంచాము. అక్కడి దకా భోజనం తీసుకుని వెళ్ళే వరకూ చల్లబడి పోవటం సహజం. నేను వారి కోసం ప్రత్యేకంగా మాప్ తయారు చేసేవాడిని. భాయీ కొత్వాల్ ప్రత్యేకమైన పిండితో వారికి డబుల్ రొట్టె తయారు చేసేవాడు. కానీ ఈ రెండూ వేడివేడిగా