పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

టాల్‌స్టాయ్ క్షేత్రం - 2

రెండవ యిబ్బంది మత సంబంధమైన విద్యకు సంబంధించినది. మహమ్మదీయులకు ఖురాన్ పారసీయులకు అలేస్తా చెప్పించాలనే కోరిక నాకు వుండేది. ఒక మహమ్మదీయ బాలకుడు వుండేవాడు. అతనికి ఖోజా తెగకుచెందిన ఒక చిన్న పుస్తకం చెప్పించేబాధ్యతను ఆ అబ్బాయి వాళ్ళ నాన్న నాపై పెట్టాడు. ఇస్లాం ఫారసీ మత గ్రంథాలను నేను సేకరించాను. హిందూ మతానికి పంబంధించిన మూల సిద్ధాంతాలను నాకు అవగతమైన రీతిలో వ్రాసుకున్నాను నా పిల్లలకోసం యీ రకంగా రాశానో లేక ఆశ్రమ వాసుల పిల్లలకోసం రాశానో నాకిప్పుడు గుర్తులేదు. నావద్ద ఆ ప్రతి యీనాడు వుండివుండే నా ప్రగతిని కొలిచే కొలబద్దగా దాన్ని ముద్రించి వుండేవాడిని. ఇలాంటి ఎన్నో వస్తువులను పారవేయటమో కాల్చి వేయటమో చేసేశాను. వస్తువులను సేకరించే అవసరం తక్కువ. ఈ కార్యక్షేత్రం విస్తృతమై పోతూ వచ్చిన తరువాత యిలాంటి యెన్నో వస్తువులను నేను వాశనం చేస్తూ వచ్చాను. దీన్ని గురించి నాకు పశ్చాత్తాపం లేదు. ఇలాంటి వస్తువుల సేకరణ నాకు ఎక్కువ ఖర్చు పెట్టించేలా తయారైంది. వాటిని రక్షించేందుకు సాధనాలు అవసరమయ్యాయి. అందువల్ల నా దనమోహరహిత ఆత్మకు అసహనం పెరిగింది.

ఆశ్రమంలో విద్యాబోధన గురించిన యీ ప్రయోగం వ్యర్థం కాలేదు దీని ఫలితంగా పిల్లలలో అసహనమన్న భావానికి చోటులేకుండా పోయింది. పరస్పర మతాల పట్ల సిద్ధాంత సంప్రదాయాల పట్ల అంతా ఉదారతను అలవరచు కున్నారు. అందరూ సొంత అన్నదమ్ముల్లా వుండటం నేర్చుకున్నారు. పరస్పరం సాయపడటం నేర్చారు. సభ్యత నేర్చారు. ఉద్యమ స్ఫూర్తి పొందారు. ఇప్పటికీ ఆ బాలల పని తీరును గురించి తెలిసిన నేను ఆనాడు టాల్‌స్టాయ్ ఆశ్రమంలో వారు నేర్చుకున్నదంతా వృధా అవలేదని చెప్పగలను. ఆ ప్రయోగం అర్థాంతరమే అయినా అది ఒక అర్థవంతమైన ధార్మిక ప్రయోగమనే చెప్పాలి. టాల్‌స్టాయ్ క్షేత్రమందలి తీయని జ్ఞాపకాలలో యీ విద్యా బోధనకు సంబంధించిన జ్ఞాపకం కూడా తీయనిదే. కానీ యీ జ్ఞాపకాలుకోసం వేరే ఒక ప్రకరణం వ్రాయడం అవసరం