పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

273


35

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3

టాల్‌స్టాయ్ క్షేత్రానికి సంబంధించిన అనేక జ్ఞాపకాలను యీ ప్రకరణంలో వ్రాయదలచాను. అవి ఒకదానికొకటి సంబంధం లేనివిగా తోచవచ్చు. అందుకై నన్ను పాఠకులు క్షమింతురుగాక

విద్యాబోధనకై నాకు అప్పగించిన పిల్లల సమూహం మరో ఉపాధ్యాయుడికి లభించి యుండదు. దాదాపు 7 సంవత్సరాల బాల బాలికలు మొదలుకొని 20 సంవత్సరాల యువకులు 12. 13 సంవత్సరాల బాలికలు ఆ సమూహంలో వుండేవాల్ళు. కొంతమంది బాలకులు ఆటవికులుగా వుండేవాళ్ళు. వాళ్ళు విపరీతమైన అల్లరి వాళ్ళు దుష్టులు కూడా. ఇలాంటి వారున్న బృందానికి ఏం చెప్పను? ఎలా చెప్పను? అందరి స్వభావాలకూ అనుకూలంగా నేను మారలేను. వారితో ఏ భాషలో మాట్లాడేది? ఈ ప్రశ్నలన్నీ నాముందుండేవి. తమిళం తెలుగు పిల్లలు తమ మాతృభాష లేదా ఆంగ్ల భాషను అర్థం చేసుకోగలరు. కొంచెం డచ్ భాష సైతం వారికి వచ్చు. కానీ నేను వారితో ఆంగ్లంలో మాత్రమే మాట్లాడగలను. విద్యార్థులను రెండు విభాగాలు చేశాను గుజరాతీ వారితో గుజరాతీలో మాట్లాడటం. తక్కిన వారితో ఆంగ్లంలో మాట్లాడం యిదీ నా పని ముఖ్యంగా వాళ్ళకు కొన్ని పసందైన కథలు చెప్పటం. పుస్తకాల నుంచి చదివి వినిపించటం వంటి ఏర్పాట్లు నేను చేశాను. వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టటం వాళ్లలో స్నేహభావం సేవాభావాన్ని వికసింప జేయుటకు ప్రధానోద్దేశ్యంగా పెట్టుకున్నాను చరిత్ర భూగోళం వంటి వాటిలో సామాన్య జ్ఞానంతోపాటు కొంత వ్రాయటం కూడా నేర్పేవాడిని. కొందరికి అంకగణితం నేర్పేవాడిని. ఇలా నా పని చేసుకుపోయేవాడిని. ప్రార్ధన కోసం కొన్ని పాటలుకూడా నేర్పుతూ తమిళ బాలురను కూడా అవి నేర్చుకోమని ప్రోత్సాహ పరచేవాణ్ణి.

బాలబాలికలందరూ స్వేచ్చగా కలిసి మెలిసి తిరిగేవారు. అక్కడ నా యీ ప్రయోగం నిర్భయంగా సాగింది. అప్పట్లో నేను వారికి నేర్పిన స్వేచ్ఛ