పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

271


అక్కడ వుండేవాళ్ళం. ప్రతి చిన్న వస్తువునూ మా చేతులతో మేమే తయారు చేసుకునే వాళ్ళం. పరోపకారులైన మా స్నేహితులు యీ విషయంలో కొన్ని నెలల వరకూ మాకు సహాయంచేశారు. శ్రీ కీలన్ బెక్ యీ విభాగానికి ముఖ్యులు. వారి జాగ్రత్త నియమ పాలన వంటి సుగుణాల అనుభవం మాకు అడుగడుగునా కలిగేది.

యువకులకోసం బాలబాలికల కోసం ఒక విశాలమైన గది అవసరమైంది ఇది అన్నింటికన్నా కఠినమైన పని చివరి దాకా యీ పని మేము చేయలేకపోయాం వాళ్ళను చదివించే బరువు బాధ్యత శ్రీ కెలన్ బెక్ మరియు నా మీద పడింది. మధ్యాహ్నం సమయంలో వారికోసం యీ పారశాల పని చేస్తూ వుండేది. ఉదయం శారీరిక శ్రమవల్ల మేమిరువురం బాగా అలిసి పోయే వారం విద్యార్థులు కూడా బాగా డస్సిపోయేపొరు విద్యార్థులూ మేమూ తూగుతూ వుండేవాళ్ళం కళ్ళపై నీళ్ళు చల్లుకుని వాళ్ళతో ఆటలాడేవాళ్ళం. మా అలసటనెలా దూరం చేసుకోవాలని ప్రయత్నించేవాళ్ళం కానీ అప్పుడప్పుడూ మా ప్రయత్నం విఫలమయ్యేది శరీరానికి అవసరమయ్యే విశ్రాంతి అది తీసుకునే తీరేది తూగుతూవున్నా తరగతులు జరుగుతూనే వుండేవి కానీ పై చెప్పిన విఘ్నాలకంటే భిన్నమైనది మరొకటి వుంది. తెలుగు తమిళం గుజరాతీ మూడు భాషలు మాట్లాడే విద్యార్థులకు ఎలా పాఠాలు బోధించడం? మాతృభాష ద్వారా విద్యాబోధన చేయాలన్న కోరిక నాకు ఎప్పుడూ వుండేది. తమిళం కాస్తంత తెలిసినా తెలుగు నాకు అసలు రాదు. ఇలాంటి స్థితిలో ఒక ఉపాధ్యాయుడు ఏమి చేయగలడు? ఆశ్రమంలో వున్న కొందరు యువకులను ఉపాధ్యాయులుగా ఉపయోగించుకునే వాళ్ళం కానీ యీ ప్రయోగం సఫలమైందని చెప్పలేము. భాయీ ప్రాగ్‌జీని యీ పనిలో వుపయోగించుకున్నాం కొంతమంది యువకులు కాస్త ఉద్రేకులు సోమరులు తమ పుస్తకాలతో వాల్లకు ఎప్పుడూ యుద్ధమే ఇదికాక మేమిరువురమూ చదువు చెప్పే పని నియమానుసారం చేయలేకపోయే వాళ్లం. అవసరం వచ్చినప్పుడల్లా నేనూ లేదా కేలన్ బెక్ జోహాన్స్‌బర్గ్‌కి వెళ్ళవలసి వచ్చేది.