పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

టాల్‌స్టాయ్ క్షేత్రం - 2


తయారు చేసుకోవచ్చు. పైగా రకరకాల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది నదీ తీరాల వద్ద మలమూత్ర విసర్జన చేసే అలవాటు వల్ల పవిత్ర నదీ తీరాలను మనం మలినం చేస్తున్నాం. ఈగలు అనేకం జన్మించడానికి మనమే కారణం భయంకరమైన మన అజాగ్రత్తవల్ల ఆ ఈగలు ఎక్కడ బడితే అక్కడున్న మలమూత్రాదులపై వాలి మళ్ళీ స్నానం చేసి శుభ్రమైన మన దేహాలపై వాలుతాయి. ఒక చిన్న గుంట మనను యీ అపరిశుభ్రాన్నుంచి రక్షించగలదు నడిచే దారుల్లో చెత్తవేయటం ఉమ్మివేయటం చీదడం యివన్నీ చేయటం భగవంతుని పట్లా మనషుని పట్ల మనం పాపం చేస్తున్నట్లే ఇందులో దయారాహిత్యం వుంది ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నామన్న భావనలేని దోషం వుంది. అడవిలో వుంటూ కూడా తన మలాన్ని మట్టితో కప్పని వాడు శిక్షకు అర్హుడు

సత్యాగ్రహుల కుటుంబాల వారిని ఉద్యమ శీలురను చేయటం డబ్బును పొదుపు చేయటం స్వావలంబనం అలవాటు చేయటం మా పనులు ఈ ధ్యేయాన్ని పూర్తి చేసుకున్న తరువాత ట్రాన్స్‌వాల్ ప్రభుత్వంలో ఎన్ని రోజులైనా మేము పోరాడవచ్చు చెప్పులకోసం డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చేది. బూట్లవల్ల ఎండ వేడిమితో నష్టపోవాల్సి వస్తుంది చెమట అంతా పాదాలవద్ద చేరి పాదాలు తడిసేవి ట్రాన్స్‌వాల్‌లో మన దేశంలో లాగా సాక్సుల అవసరం అంతగా వుండదు. కానీ ముళ్ళూ రాళ్ళనుంచి రక్షణకై కాళ్ళకి ఏదో ఒకటి అవసరం అన్న విషయం మేమూ ఒప్పుకున్నాం అందువల్ల చెప్పులు తయారు చేసే వృత్తిని నేర్చుకోవాలని నిశ్చయించాం దక్షిణాఫ్రికాలో పాయిన్ టౌన్ వద్ద మేరీయన్ హిల్‌లో ట్రేపిస్ట్ అన్న రోమన్ కాథలిక్ ఫాదరీల మఠం వున్నది. అక్కడ యిలాంటి వృత్తులు నేర్పుతారు వాళ్ళు జర్మనులు. శ్రీ కేలన్ బెక్ అక్కడికి వెళ్ళి చెప్పులు తయారు చేసే కళ నేర్చుకుని వచ్చారు. వారి నుంచి నేను నా నుంచి తక్కిన వారూ నేర్చుకున్నాడు. ఇలా చాలా మంది నవయువతులు చెప్పులు మా కోసం తయారు చేయటమే కాక బైటి వారికి కూడా అమ్మసాగారు. నా శిష్యులు చాలా మంది యీ కళలో నన్ను మించి పోయారని వేరే చెప్పనవసరం లేదు. ఇలాగే తోలుపని కూడా మొదలెట్టాం ఒక గ్రామంలా మేమంతా