పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

269

కానీ మళ్ళీ ప్రయాణం గురించిన విషయానికే రావలసి వచ్చింది. సరదాగా జోహాన్స్‌బర్గ్‌కు వెళ్ళాలను కునేవారు వారానికి ఒకటి రెండు సార్లు నడిచివెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చేసేవాళ్ళు 21 మైళ్ళ దూరమని ముందే చెప్పాను నడిచి వెళ్ళవలసి రావటం వల్ల మా డబ్బు చాలా మిగులసాగింది పైగా నడిచివెళ్ళే వాళ్లకు లాభించింది కూడా కొంతమందికి నడక అలవాటై పోయింది. ఇలా జోహాన్స్‌బర్గ్ వెళ్ళాలనుకునే వారు తెల్ల వారగట్ల 2 గంటలకు లేచి 2-30 కల్లా బయలు దేరి 6, 7 గంటల్లోపల జోహాన్స్‌బర్గ్ చేరుకునేవారు త్వరగా నడిచి నాలుగు గంటల 17 నిమిషాల్లో అక్కడికి చేరుకునేవారు

క్షేత్రంలో వుండేవాళ్ళు దీనిని భారంగా కాక ప్రేమగా పాటించేవారు కేవలం నియమాల మీదనే ఆధారపడి ఆశ్రమంలో ఏ ఒక్కరినీ వుంచలేము. పైగా నవయువకులు నవ్వుతూ త్రుళ్ళుతూ క్షేత్రానికి సంబంధించిన పనులు సైతం చేసేవారు కొంచెం శరీర కష్టంతో చేయాల్సిన పనులు అప్పగించినపుడు వారు చేసే హడావిడిని ఆపటం కష్టమయ్యేది. సంతోషంగా వారెంత వరకు పనిచేయగలరో అంత వరకే వారిచే పని చేయించటం జరిగేది. ఈ నియమం వల్ల పని పూర్తికాకపోవటమన్నది నేనేనాడూ గమనించలేదు

శుచిశుభ్రత గురించిన సంగతైతే కధ లాగా వుండేది. ఇంతమంది పని చేసేవాళ్ళున్నా ఏనాడూ చెత్తా చెదారమూ ఎంగిలి పదార్థాలూ కనిపించేవి కావు ఈ చెత్తాచెదారమంతా త్రవ్వి వుంచిన మట్టి కింద పాతి పెట్టడం జరిగేది. దారిలో నీళ్ళు చలటం నిషిద్ధం నీళ్ళను పాత్రలో సేకరించి వుంచి చెట్ల పాదుల్లో పోసేవారు. తిండిలో మిగిలిపోయిన పదార్థాలను ఎంగిలి పదార్థాలను ఓ చోట నియమంగా పడవేసేవారు. మైల పదార్థాలను 11/ 2 అడుగులోతు గలిగిన ఓ గుంటలో వేసి వుంచి అది నిండిన తరువాత కప్పివేయటం జరిగేది. అందువల్ల దుర్గంధం వుండేది కాదు. అక్కడ ఈగలు పారాడేవీకావు చెత్తాచెదారాన్ని కప్పి వేశారన్న అనుమానమూ వచ్చేది కాదు దానికి తోడు క్షేత్రానికి అమూల్యమైన ఎరువు కూడా లభించేది. నిజానికి యీ చెత్తాచెదారాన్ని సరిగా వుపయోగిస్తే లక్షలాది రూపాయల ఎరువు