పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

రెండవ ప్రతినిధి సంఘం


దక్షిణాఫ్రికాకు చెందిన ప్రసిద్ధ రాజకీయవేత్త శ్రీ మేరీమైన్ కూడా వున్నారు దక్షిణాఫ్రికా ప్రాంతాలను కలిపి ఏకం చేసే ఉద్దేశ్యంతో వారు వెళ్తున్నారు. జనరల్ స్మట్స్ తదితరులు ముందే ఇంగ్లాండుకు చేరుకున్నారు నేటాల్‌లో వున్న భారతీయుల పక్షాన మరో ప్రతినిధి బృందం యీసారి ఇంగ్లాండు వెళ్ళింది. సత్యాగ్రహ సంబంధంగాకాక నేటాల్ భారతీయుల తీవ్ర యిబ్బందుల సంబంధంగా వారు వెళ్లారు.

అప్పుడు లార్డ్‌క్రూ అధినివేశరాజ్యాల మంత్రిగాను లార్డ్‌మోలే భారత మంత్రిగాను వున్నారు. వీరిద్దరితో పెద్ద ఎత్తున మా చర్చలు జరిగాయి. ఏ మాత్రం వీలున్నా, మేము కలవని ప్రభుత్వ అధికారి అక్కడ మిగలలేదు లార్డ్ ఎంప్ట్‌హిల్ గారి సహాయానికి అంతేలేదు. శ్రీ మేరీమైన్, జనరల్ బోధా మొదలైన వారిని కలిసేవారు. చివరికి జనరల్ బోధా మా కోసం పంపిన ఒక సందేశాన్ని వినిపించారు. "జనరల్ బోధా మీ భావనను అర్థం చేసుకున్నారు. మీ చిన్న చిన్న అవసరాలను తీర్చేందుకు ఆయన అంగీకరించారు. కానీ ఆపియా చట్టాన్ని రద్దు చేసేందుకు దక్షిణాఫ్రికాలోనికి కొత్తగా ప్రవేశించే వారిపై ఆంక్షలు విధించే చట్టాన్ని మార్చేందుకు వారు అనుకూలంగా లేరు. చట్టంలో వర్ణభేదాలకు సంబంధించిన ఇప్పుడున్న అంశాలను మీరనుకుంటున్నట్టు మార్చేందుకూ వారు అంగీకరించే స్థితిలో లేరు ఈ వర్ణభేదం సిద్ధాంత పరమని వారు భావిస్తున్నారు. కానీ మీ ఆశయం మేరకు దీన్ని మార్చాలని ప్రయత్నించినా దక్షిణాఫ్రికాలోని తెల్లవారు దీనిని సహించలేరు. జనరల్ స్కట్స్ అభిప్రాయం కూడా ఇదే. ఇదే చివరి నిర్ణయమని వారిద్దరూ అంటున్నారు. ఇంతకు మించి మీరు ఏమాత్రం కోరినా అది మీకూ మీ దేశానికి కూడా దు:ఖ కారణమవుతుంది. అందువల్లే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, బాగా ఆలోచించి తీసుకొనటం మంచిది ఈ సంగతి మీకు తెలియజేయటానికీ మీ బాధ్యతను మీకు స్పష్టం చేయటానికి నన్నిక్కడికి పంపారు" అని చెప్పారు. లార్డ్ ఎంప్ట్‌హిల్

ఈ సందేశాన్ని వినిపించిన తరువాత లార్జ్ ఎంప్ట్‌హిల్ "చూడండి! జనరల్ బోధా మీ వ్యావహారిక అవసరాల నన్నింటినీ తీర్చేందుకు అంగీకరించారు