పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

259


ఇచ్చిపుచ్చుకోవడమన్నది ప్రతిచోటా వుండనేవుంది. మనకు కావలసినదంతా దొరకదు కదా అందువల్ల యీ ప్రస్తావనను అంగీకరించమని నా హృదయ పూర్వక అభ్యర్థన సిద్ధాంత రీత్యా ప్రభుత్వంతో మీరు వాదించదలచుకుంటే భవిష్యత్తులోనూ చేయవచ్చు. ముందు యీ విషయమై మీరిరువురూ చక్కగా ఆలోచించుకుని నాకు జవాబివ్వండి" అని అన్నాడు

అంతావిని నేను హాజీహబీబ్ సేఠ్ వైపు చూచాను ఒప్పందం దృష్టితో నేను జనరల్ బోధా ప్రస్తావనను అంగీకరిస్తున్నట్టు మీరు నా పక్షాన చెప్పండి ఇప్పుడీ మాత్రమైనా అంగీకరిస్తే సిద్ధాంతాలకోసం తరువాత ప్రయత్నించవచ్చు జాతి మరింత నష్టపోవటం నాకు యిష్టం లేదు అన్నారాయన

సేఠ్ గారు తన మాటలను ఒక్కటీ పొల్లు పోకుండా లార్డ్ ఎలఫ్ట్‌హిల్ గారికి వినిపించిన తరువాత సత్యాగ్రహుల పక్షాన నేను మాట్లాడాను. "మీరు తీసుకున్న చొరవకు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వీరు నా మిత్రుడన్న మాట నిజమే కాని వారు ధనవంతుల పక్షాన మాట్లాడుతున్నారు. నేను బీద ప్రజల పక్షాన తక్కువ సంఖ్యలో ఉన్నవారి పక్షాన మాట్లాడుతున్నాను కానీ నా ప్రజలు జీవితాన్ని పణంగా పెట్టగలరు వారి యీ సమరం వ్యావహారిక జీవనంకోసం, సిద్ధాంతాలకోసం - రెండింటి కోసమూ జరుగుతున్నది. రెండింటిలో ఏదేని ఒక దానినే ఎన్నుకోవలసి వస్తే సిద్ధాంతాన్ని మాత్రమే ఎన్నుకుంటారు జనరల్ బోధా గారీ శక్తేమిటో మాకు తెలుసు కానీ మా ప్రతిజ్ఞయే మాకు ముఖ్యం కనుక ప్రతిజ్ఞాపాలనకై నాశనమై పోవటానికి మేము సన్నద్ధంగానే వున్నాము. మేము దైర్యం వహిస్తాము మేము మా నిర్ణయంపై నిశ్చలంగా వుంటే మేము నమ్ముకున్న భగవంతుడే యీ కార్యాన్ని పూర్తి చేయగలడన్న విశ్వాసం మాకున్నది" అని అన్నాను ఇంకా యిలా నా అభిప్రాయాన్ని కొనసాగించాను - 'మీ స్థితి నాకు బాగా అర్థమైంది మా కోసం మీరెంతో చేశారు. పిడికెడు సత్యాగ్రహుల కోసం మీరెక్కువ సాయం చేయలేక పోయినా మిమ్మల్ని మేము తప్పుపట్టము మీరు చేసిన ఉపకారాన్ని మరువ లేము కూడా. మీరిచ్చిన సలహాను అంగీకరించలేని మా అసమర్థతను తమరు క్షమిస్తారనే మా ఆశ. మా