పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

దేశ బహిష్కరణ


ఎవరిని పంపాలో నిర్ణయించేందుకు తగినంత సమయం లేదు. నా సహచరుల్లోని పి కె నాయుడుపై నా దృష్టిపడింది.

మరీ బీదసోదరులతో భారతదేశం వరకు వెళ్ళగలరా? అని ప్రశ్నించాను

'ఎందుకు వెళ్ళలేను?'

కానీ ఓడ కొద్ది గంటల్లోనే బయలు దేరబోతోంది కదా!

"బయలుదేర నివ్వండి"

"కానీ మీ కట్టు బట్టల సంగతేమిటి? భోజనం సంగతేం చేస్తారు?"

"నేను వేసుకున్న బట్టలు చాలు భోజనం ఓడపై వుంటుంది కదా!

నా ఆశ్చర్యానికీ ఆనందానికీ అంతే లేకుండా పోయింది. పారసీ రుస్తమ్‌జీ యింట్లో యీ సంభాషణ జరిగింది. అక్కడే నాయుడు కోసం, దుస్తులు, కంబళి వగైరా అడిగి తీసుకుని ప్రయాణం చేయించాను

నాయుడితో అన్నాను. చూడండి! మార్గమధ్యంలో యీ సోదరులను జాగ్రత్తగా చూచుకోండి ముందు వీరి విశ్రాంతి సంగతి చూడండి తరువాత మీసంగతి చూచుకోండి నేను మద్రాసు నటేశన్‌గారికి తంతి పంపుతాను వారెలా చెబితే అలా చేయండి" అని చెప్పాను

'నేను నిజమైన సైనికునిగా వుండేందుకు ప్రయత్నిస్తాను' అని చెప్పి నాయుడు ప్రయాణమయ్యారు. ఇలాంటి వీర పురుషులున్న చోట, అపజయం వుండనే వుండదని మనస్సులో అనుకున్నాను దక్షిణాఫ్రికాలోనే నాయుడుగారు జన్మించారు. హిందూదేశాన్ని ఎన్నడూ వారు చూడలేదు. నటేశన్ గారికి ఒక సిఫారసు పత్రం వ్రాసి నాయుడుగారికిచ్చాను. శ్రీనటేశన్ గారికి తంతి కూడా యిచ్చాను

ప్రవాస భారతీయుల దుఃఖాలను గమనించే వారు వారికి సహాయాన్నందించేవారు. వారిని గురించి పకడ్బందీగా వ్రాసేవారు ఒక్క నటేశన్ గారేనని చెప్పవచ్చు. వారితో నియమబద్ధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ వుండేవి దేశ బహిష్కరణ శిక్షపొందిన భారతీయులు అక్కడికి చేరుకున్నప్పుడు వారికి నటేశన్ గారెంతో సాయం చేశారు. శ్రీ నాయుడు వంటి యోగ్యమైన వ్యక్తి వెంటవుండటం వల్ల నటేశన్ గారికి కూడా