పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

253


చాలాసహాయం లభించింది. మద్రాసు ప్రజల వద్ద విరాళాలు సేకరించి దక్షిణాఫ్రికా నుండి వచ్చిన హిందూదేశ ప్రజలను ఆదుకున్నారు. వారికి చేదు అనుభవం కలుగకుండా చేశారు

ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం చేసిన యీ పని నిర్దయతో కూడినదే కాక చట్టవిరుద్ధమైనది కూడా ప్రభుత్వానికీ సంగతి తెలుసు సాధారణంగా ప్రజలకు తెలియని విషయం ఒకటుంది. ప్రభత్వుం ఒక్కోసారి తన చట్టాలను తనే ఉల్లంఘిస్తూ వుంటుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పటికప్పుడు కొత్త చట్టం తయారుచేసే సమయం వుండదు. కాబట్టి వున్న చట్టాలను ఉల్లంఘించి యిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవటం ప్రభుత్వం చేసే పని తరువాత వీలైతే కొత్త చట్టాన్ని రూపొందిస్తుంది లేదా తాను చేసిన పసులను ప్రజలు మరచిపోయేందుకు వాళ్ళ దృష్టిని మళ్ళిస్తుంది

ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు సాగించారు. భారతదేశంలోనూ అలజడి మొదలైంది. దీని పరిణామంగా బీద భారతీయులకు దేశ బహిష్కరణ శిక్షను యింత కఠినంగా విధించటం ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి కష్టమైపోయింది. భారతీయులు ఈ ప్రభుత్వం చర్యకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు ఈ దేశ బహిష్కరణకు విరుద్ధంగా వారుచేసుకున్న అపీళ్ళకు విజయం లభించింది. చివరికి దక్షిణాఫ్రికా భారతీయులకు భారతదేశం వరకు దేశ బహిష్కరణ విధించే పద్ధతి నిలిచిపోయింది

కానీ యీ దేశ బహిష్కరణ విధానం యొక్క ప్రభావం సత్యాగ్రహ సైనికులపై బాగా పడింది. ఇప్పటిదాకా సమరంలో పాల్గొన్నవారు మంచి పోరాట పటిమకల వారే కానీ ప్రభుత్వం మళ్లీ దేశ బహిష్కరణ క్రింద భారతదేశం పంపిచివేస్తే ఎలా అన్న భయం మాత్రం కొందరిని పట్టుకున్నది జాతిని నిరుత్సాహపరచాలన్న ప్రయత్నాలు ప్రభుత్వం యిక చేయలేదు. సత్యాగ్రహ ఖైదీలను ఏడిపించటానికి అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేసిందని గత ప్రకరణంలో చెప్పానుకదా? రాళ్ళు కొట్టించే పని వారితో చేయించారు. ఇది వరకు సత్యాగ్రహ ఖైదీలనందరినీ ఒకే చోట వుంచే