పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

251


తలచుకుంటేనే అసహ్యం వేస్తుంది కానీ వారికి సాయం ఎలా చేయాలో మాకు అర్ధం కాలేదు. డబ్బు మావద్ద కొద్దిగా వుంది. ఇలాంటి సమరంలో పోరాడేవారికి డబ్బురూపంలో సహాయ మందివ్వటం మొదలెడితే, యుద్ధంలో ఓడిపోయే ప్రమాదం కలుగవచ్చు. ఆశాపరులు అందులో ప్రవేశిస్తారు అందువల్ల డబ్బుపై ఆశపడ్డ ఒక్కరిని కూడా యీ సమరంలోకి అనుమతించలేదు. అయినా యిలాంటి వారికి సానుభూతి రూపంలో సహాయం చేయటం మా ధర్మంగా భావించాం

అనుభవం మీద గ్రహించిన విషయం చెబుతున్నాను సానుభూతి, తియ్యటి మాటలు, చల్లని చూపువల్ల జరిగే పనులు, డబ్బు వల్ల జరగవు డబ్బును ఆశించే లోభికైనా డబ్బుతో పాటు సానుభూతి లభించకపోతే ఆ డబ్బును తిరిగి యివ్వటానికి సిద్ధపడతాడు. దీనికి వ్యతిరేకంగా ప్రేమకు వశులైనవారు ప్రేమించే వారితో పాటు ఎన్ని కష్టాలనైనా భరించటానికి సిద్ధ పడతారు

అందువల్ల దేశ బహిష్కరణ శిక్ష పడిన వారికి ప్రేమ సానుభూతి వాక్యాలతో పాటు సాధ్యయమైనంత సాయం చేయటానికి నిశ్చయించాం హిందూదేశంలో వారికి అవసరమైన వ్యవస్థ ఏర్పాటు చేయగలమని మేము వారికి నచ్చచెప్పాము వీరిలో చాలా మంది గీర్‌మిట్ ప్రధ సుంచి ముక్తి పొందిన భారతీయులన్న సంగతి పాఠకులు గుర్తుంచుకోవాలి వారి బంధువులు గాని రక్త సంబంధీలుగాని భారతదేశంలో లేరు. కొంతమంది దక్షిణాఫ్రికాలోనే జన్మించినవారు వారందరికి భారతేశం విదేశం వంటిదే ఇలాంటి నిరాధారులైన మనష్యులను హిందూదేశపు సరిహద్దువద్ద నిస్సహాయస్థితిలో వదలి రావటం, ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం చేసిన, ఘోరమైన క్రూరత్వం అమానుష చర్య అందువల్ల భారతదేశంలో వారికి అవసరమైన ఏర్పాటు చేయగలమని వారికి విశ్వాసం కలిగించాం

ఇన్ని చేసినా, వారి వెంట సాయానికెవరినైనా పంపకపోతే, వారికి శాంతి కలుగదు. దేశ బహిష్కరణ శిక్షను పొందిన వారి మొట్టమెదటి దళమిది. వారి ఓడ మరికొన్ని గంటల్లోనే ప్రయాణం కావటానికి సిద్ధంగా వుంది