పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

249

నన్ను వారినుండి వేరు చేయటం వల్ల, నాకూ కాస్త యిబ్బంది కలిగించ వచ్చనీ, యితర సత్యాగ్రహ సోదరులు సైతం చల్లబడిపోతారనీ ప్రభుత్వం భావించింది కానీ యింత మంచి అవకాశం వారికి ఎప్పుడూ రాలేదు నన్ను ప్రిటోరియా జైలుకు తీసుకుని వెళ్ళారు. ఉత్పాతం సృష్టించే ఖైదీలకోసం కేటాయించిన ఓ గదిలో నన్ను బంధించారు. కేవలం కసరత్తుకోసం రెండు గంటలు నన్ను బైటికి అనుమతించేవారు. వాక్స్‌రస్ట్‌లో భోజనంతో పాటూ నెయ్యి యివ్వబడేది. కానీ యిక్కడ యివ్వరు యిక్కడి చిన్నా చితకా యిబ్బందుల గురించి నేను చర్చించ దలచుకోలేదు తెలుసుకోదలచినవారు దక్షిణాఫ్రికా జైళ్ళలోని నా అనుభవాలు అన్న పుస్తకం చదివి తెలుసుకొనవచ్చు

ఎన్ని కష్టాలు పడినా భారతీయులు ఓడిపోలేదు. ప్రభుత్వం సుదీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఆఖరికి ఎంతమంది భారతీయులను జైళ్ళలో ప్రభుత్వం నింపగలదు దానివల్ల ఖర్చెంత పెరుగుతుంది? అందుకే ప్రభుత్వం పరిస్థితిని ఎదుర్కొనటానికి యితర సాధనాలను. మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది.



31

దేశ బహిష్కరణ

ఈ ఖూనీ చట్టంలో మూడు రకాల శిక్ష విధించేందుకు వీలుంది జుర్మానా, ఖైదు, దేశ బహిష్కరం ఈ మూడు శిక్షలూ ఒకేసారి విధించే అధికారం కూడా కోర్టుకున్నది. చిన్నమేజిస్ట్రేటు సైతం యీ శిక్షను విధించవచ్చు అట్టి అధికారాన్ని ప్రభుత్వం వారికిచ్చింది. ముందు రోజుల్లో దేశ బహిష్కరణ అంటే, ట్రాన్స్‌వాల్ సరిహద్దును దాటి నేటాల్, లేదా ఫ్రీస్టేట్ సరిహద్దు లేదా డేలగోవా సరిహద్దు వరకూ అపరాధిని వదలి రావటం అనుకునేవారు ఉదాహరణకు, నేటాల్ వైపు నుంచీ వచ్చే భారతీయులను, వాక్స్‌రస్ట్ స్టేషన్ సరిహద్దు రేఖ బైటికి తీసుకువెళ్ళి వదిలి వేసేవారు. ఇలాంటి దేశ