పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

సంగ్రామ ప్రవేశం


చదవలసి వచ్చేది. కానీ పాపం రాయ్‌పేన్ యీ మాత్రం కుడా చేయలేకపోయేవారు. ఇలాంటి వారు బారిష్టరీ పదవిని త్యాగం చేసి, అనుమతి పత్రం లేకుండా తిరిగి, జైలు కెళ్ళారు. అక్కడి కష్టాలన్నీ అనుభవించారు. "నేను రైల్లో మూడవ తరగతిలో ప్రయాణం చేయవలసి వస్తుందా! అని నన్నోసారి అడిగారు. 'రైల్లో మొదటి తరగతి లేదా రెండవ తరగతిలో మీరు ప్రయాణిస్తే, చెప్పండి? అయినా మూడవ తరగతిలో మిమ్మల్ని బారిష్టర్‌గా ఎవరు గుర్తిస్తారో చెప్పండి అని తిరిగి వారినే అడిగాను జోసెఫ్ రాయ్‌సేన్‌కి యీ సమాధానం చాలు

పదహారు సంవత్సరాల పసివారెందరో జైళ్ళకు వెళ్లారు. మోహన్ లాల్ మాన్‌జీ ఘేలానీ అన్న అబ్బాయికి కేవలం పదునాలుగు సంవత్సరాలే

సత్యాగ్రహులైన వారిని తీవ్రంగా బాధించేందుకై ఏ ప్రయత్నాన్ని జైలు అధికారులు వదిలిపెట్టలేదు. వారిచేత మరుగు దొడ్లు శుభ్రం చేయించారు ఖైదీలు నవ్వుతూ ఆ పని చేశారు

ఖైదీలచేత రాళ్ళు కొట్టించారు. రాముడు లేదా ఖుదా పేరు ఉచ్చరిస్తూ వారా పని ఆనందంగా చేశారు. వారి చేత చెరువులు త్రవ్వించారు రాళ్ళతో నిండిన భూములను త్రవ్వించారు. వాళ్ళ చేతులకు బొబ్బలెక్కాయి కొంతమంది బాధకు తట్టుకోలేక నొప్పితో మూర్చపోయారు. అయినా వారు ఓటమి నంగీకరించలేదు.

జైళ్ళలో ఖైదీల మధ్య పరస్పర బేదాభిప్రయాల వల్ల కీచులాటలు, ఈర్ష్యాద్వేషాలు వుండవని పాఠకులు అనుకోకూడదు. చాలావరకు పెద్ద రగడలు, తిండి తిప్పల విషయంలోనే వస్తుంటాయి. కానీ మేము వాటిని అధిగమించాము

నన్నుకూడా రెండవసారి అరెస్టు చేశారు. ఓసారి వాక్స్‌రస్ట్ జైల్లో దాదాపు డెబ్బైయైదు మంది ఖైదీలు చేరాం వంట మేమే చేసుకునే వాళ్ళం నేను వంట వాణ్ణి అయ్యాను. కారణం తిండికి సంబంధించిన భేదాభిప్రాయాలను నేను సవ్యంగా సర్దగలిగాను నా తోటివారు నాపై ప్రేమతో నేను వండిన ఉడికీ ఉడకని పదార్థాలు చక్కెర లేని లస్సీని సైతం ఏ ఫిర్యాదు లేకుండా తీసుకునేవారు.