పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

దేశ బహిష్కరణ


బహిష్కరణలో అసౌకర్యం తప్ప ప్రజలకే కష్టమూ వుండేది కాదు. నిజంగా యిది నవ్వులాట వంటిదే దీనివల్ల హిందూదేశ ప్రజల పట్టుదల వుత్సాహము మరింతగా పెరిగాయి

అందుకోసం భారతీయులను ఆశాంతి పాటు చేయటానికి కొత్త యుక్తులను ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం వెదక వలసి వచ్చింది జైళ్ళల్లో స్థలమనేది లేకుండా పోయింది. అందువల్ల భారతీయులకు, భారతదేశ సరిహద్దు వరకూ దేశ బహిష్కరణ శిక్షగా విధిస్తే వాళ్లప్పుడు నిజంగానే భయపడి, మనలను శరణుజొచ్చుతారని వారు వూహించారు. ప్రభుత్వపు యీ ఆలోచనలో తప్పక కొంత నిజం వుంది. హిందూస్తానీయుల గుంపునొకదానిని హిందూదేశానికి పంపించివేశారు. మార్గమధ్యంలో వాళ్లు ఎన్నెన్నో కష్టాలుపడ వలసి వచ్చింది తినటానికి త్రాగటం అసౌకర్యం ఏర్పడింది. ఓడలో తినుబండారాలు త్రాగేనీటి వ్యవస్థ కోసం చేసిన ఏర్పాట్లతోనే అవసరాలు తీర్చుకోవలసి వచ్చింది. అందరినీ డెక్ పైకి పంపంటం జరిగింది. వారిలో కొంతమందికి దక్షిణాఫ్రికాలో భూములు, ఆస్థిపాస్తులు వ్యాపారం అన్నీ వున్నాయి. మరి కొంతమంది నెత్తిపైన అప్పులూ వున్నాయి. శక్తి వుండికూడా, యిన్నీ పోగొట్టుకొని, దీవాళా తీసేందుకై చాలా మంది సన్నద్ధులు కాలేరుకదా! ఇన్ని వున్నా, చాలామంది భారతీయులు దృఢంగా నిలిచారు. మరికొంతమంది డీలా పడిపోయారు. డీలా పడిపోయినవారు స్వచ్ఛందంగా అరెస్టు ఆపటం నుంచి తప్పించుకో జూచారు. కానీ కాల్చివేసిన అనుమతి పత్రాల స్థానంలో కొత్త అనుమతి పత్రాలను పొందడం వంటి బలహీనతను చూపించలేదు కానీ కొంతమంది భయంకొద్దీ కొత్త అనుమతి పత్రాలు కూడా సంపాదించారు

అయినా దృఢంగా నిలిచినవారి సంఖ్య తక్కువేమీ కాదు. వాళ్ళ సాహసానికి అంతేలేదు నా ఉద్దేశ్యంలో వారిలో కొంతమంది నవ్వుతూ నవ్వుతూనే ఉరికంబమెక్కేంత ధైర్యవంతులు కానీ భారతదేశానికి పంపించి వేయబడినవారిలో చాలామంది బీదవారు. అమాయకులు వారు కేవలం ఆసక్తితో సత్యాగ్రహ సమరంలో చేరారు. వారిపై ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు