పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

సంగ్రామ ప్రవేశం


వారంతా ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించారు. చివరికి సెప్టెంబర్ 8 నాటికి సరిహద్దు నగరమైన వాక్స్‌రస్ట్‌లో వారిపై కేసు బనాయించి, 50 పౌండ్ల జుర్మానా లేక మూడు నెలల కఠిన కారాగారశిక్ష అనుభవించమని తీర్పు ప్రకటించారు. సత్యాగ్రహులంతా సంతోషంగా జైలు శిక్షనే కోరుకున్నారు వాక్స్‌వరస్ట్ జైల్లో వారిని వుంచారు

దీనితో ట్రాన్స్‌వాల్ యందలి భారతీయుల ఉత్సాహం పెరిగింది నేటాల్ నుంచి మాకు సహాయం చేయటానకై వచ్చిన వారిని జైలునుంచి విడిపించలేకపోయినా, కనీసం జైలు వెళ్లటానికి వారికి సాయం చేయాలన్న తలంపు ట్రాన్స్‌వాల్‌లోని భారతీయులకు కలిగింది. దీనితో వారు జైలుకు వెళ్ళే మార్గాలను వెదుక సాగారు. అరెస్ట్ కావటానికి అనేక అవకాశాలున్నాయి ట్రాన్స్‌వాల్‌లో వుండే భారతీయుడెవరైనా తన అనుజ్ఞా పత్రాన్ని చూపించకపోతే యిక అక్కడ వ్యాపారం చేసేందుకు అనుమతి వారికి లభించదు. ఒకవేళ వ్యాపారానికి అనుమతి పొందకుండా వ్యాపారం చేస్తే అది ఆపరాధమవుతుంది నేటాల్ నుండి ట్రాన్స్‌వాల్ లోకి ప్రవేశించాలనుకునే భారతీయుడు సైతం అనుమతి పత్రాన్ని చూపించ వలసి వుంటుంది. లేకపోతే వారిని అరెస్ట్ చేస్తారు. కానీ అనుమతి పత్రాలు ముందే కాల్చి వేయబడ్డాయి కాబట్టి వారి మార్గం సుగమమైంది రెండు పద్ధతులనూ వారు ఆచరించారు. కొంతమంది అనుమతి పత్రాలను చూపించకుండా, తిరగనారంభించారు. మరికొందరు అనుమతి పత్రాలు లేకుండానే సరిహద్దును దాటనారంభించారు. ఈ రెండు పద్ధతులను అనుసరించిన వారిని అరెస్టు చేయసాగారు

ఇప్పుడిక ఉద్యమం తీవ్రస్థాయి చేరుకున్నది. ప్రతి సత్యాగ్రహునికీ కష్టాలు మొదలయ్యాయి. నేటాల్ నుంచి తక్కిన భారతీయులు సైతం ట్రాన్స్‌వాల్‌లోకి ప్రవేశించసాగారు. జోహాన్స్‌బర్గ్‌లోను చాలామంది అరెస్ట్ అయ్యారు. జైళ్ళు నిండిపోసాగాయి. నేటాల్ నుంచి వచ్చిన వారికి మూడు నెలలు జైలు శిక్ష పడేది ట్రాన్స్‌వాల్‌లో అనుమతి పత్రం లేకుండా తిరిగేవారికి నాలుగు రోజుల నుంచి మూడునెలలు వరకూ శిక్ష పడేది

ఇలా జైలు శిక్ష పడినవారిలో మాయిమామ్ సాహబ్- ఇమామ్ అబ్దుల్ కాదిర్ బాప్ జీర్ కూడ వున్నారు. వారు అనుమతి పత్రం లేని కారణంగా