పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

247


అరెస్ట్ కాబడ్డారు 21 జూలై 1908 నాడు వారికి నాలుగు రోజుల కఠిన జైలుశిక్ష పడింది. జైలు వెళ్ళిరావాలన్న కోరిక ప్రకటించిన ఇమామ్‌గారి దుర్బల శరీరాన్ని చూసి లోకులు నవ్వసాగారు. “భయ్యా. ఇమామ్‌ఖాన్ సాహెబ్ గారిని తీసుకుని వెళ్ళకుంటేనే మంచిది జాతి నవ్వుల పాలు అవుతుంది ". అని నాతో కొంతమంది అన్నారు. వారి మాటలను నేను పట్టించుకోలేదు. ఇమామ్ సాహెబ్ గారి శక్తిని కొలవటానికి నేనెవరిని? ఇమామ్ సాహెబ్ చెప్పులు లేకుండా ఎప్పుడు నడిచేవారే కాదు వారు మంచి విలాసపురుషులు వారి శ్రీ మతి మలయా దేశానికి చెందినది. తమ యింటిని అలంకరణ సామగ్రితో నింపి వుంచేవారు. గుర్రపు బండిలో తప్ప యిల్లు వదిలి వెళ్ళేవారు కారు. ఇది నిజం కానీ వారి మనసెలాంటిదో ఎవరికి తెలుసు? ఇలాంటి ఇమామ్ గారు నాలుగురోజుల కఠిన కారాగార శిక్ష అనుభవించి వచ్చారు. మళ్ళీ ఒకసారి జైలుకెళ్ళారు. జైల్లో ఒక ఆదర్శ ఖైదీగా, పరిశ్రమ చేసే ఖైదీగా కాలం గడిపేవారు. పరిశ్రమ చేసిన తరువాతే భోజనం చేసేవారు. వారికి రోజూ భోజనంలో కొత్త వంటకాలు తినే అలవాటుంది కానీ జైల్లో మొక్కజొన్నల లస్సీ తాగి సంతృప్తి పడవలసి వచ్చింది. జైలు జీవనం చూచి ఏనాడూ వారు తలవంచ లేదు. పైగా దాని వల్ల జీవితంలో సాదాతనాన్ని అలవరచుకున్నారు. జైల్లో రాళ్లు కొట్టి, చెత్త వూడ్చి తోటి ఖైదీలలో వరుసన నిలబడ్డారాయన చివరికి ఫినిక్స్ ఆశ్రమంలో కుండలో నీళ్ళు నింపటం ప్రెసెలో కంపోజ్ చేసే విద్యను కూడా అభ్యసించారు. ఫినిక్స్ ఆశ్రమంలో నివసించేవారికి, కంపోజ్ చేసే కళ నేర్వటం తప్పని సరి ఈ కళను యిమామ్ సాహెబ్ శక్తి మేరకు నేర్చుకున్నారు. ఇప్పుడు వారు భారతదేశంలో సేవా కార్యంలో లీనమై వున్నారు. ఇలా ఎంతో మంది జైళ్ళకు వెళ్ళి పరిశుద్ధులై వచ్చారు

జోసెఫ్ రాయ్‌పెన్ బారిష్టర్‌గా వుండేవారు. వారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ పట్టభద్రులు నేటాల్‌లో గిర్‌మిటియా కుటుంబంలో జన్మించినా, దొరబాబు అయ్యారు ఇంట్లో కూడా బూట్లు లేకుండా నడిచేవారుకారు ఇమామ్ గారికి నమాజు చేసే సమయంలో కాళ్ళు కడగాల్సి వచ్చేది. వట్టి కాళ్ళతో నమాజు