పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

245


పారసీ రుస్తుంను యిది వరకే పరిచయం చేశాను సుశిక్షితులైన భారతీయుల్లో ఎక్కువ మందిని పాఠకులు ఎరుగుదురు నేనేదైనా సామగ్రి లేదా సాహిత్యం లాంటి ఆధారాలేమీ లేకుండానే యీ ప్రకరణాలను వ్రాయపూనుకున్నాను. అందువల్ల యీ ఉద్యమంలో పాలు పంచుకున్న మరికొంతమంది పేర్లేవైనా మిగిలిపోయివుంటే. ఆ మిత్రులు నన్ను క్షమించాలి ఈ ప్రకరణాలు ఆయా పేర్లను చిరస్థాయిగా వుంచడానికి వ్రాయడం లేదు సత్యాగ్రహ విజయం ఎలా అందుకొనగలిగామో, అందులో మాకెదురైన అడ్డంకుల్ని ఎలా అధిగమించగలిగామో తెలియచేయటానికి యీ ప్రకరణాలను వ్రాస్తున్నాను. పేర్లను. వ్యక్తుల గురించి నేను పరిచయం చేయటానికి కారణం నిరక్షరాస్యులుగా పరిగణింపబడే భారతీయులు సైతం దక్షిణాఫ్రికాలో చూపించిన పరాక్రమం వారు చేసిన అద్భుతాలను గురించి పాఠకులు తెలుసుకోవాలనే ఆంతేకాదు, యీ జాతీయ సమరంలో హిందూ ముస్లిం పారసీ, క్రైస్తవ సోదరు లెందరో చక్కగా కలిసి నడవగలిగారు. హిందూ దేశీయులైన వ్యాపారులు, విద్యాధికులైన వారు అంతా తమ వంతు కర్తవ్యాన్ని పూర్తిగా నెరవేర్చిన వైనం పాఠకులకు తెలియచేయాలని నా ఉద్దేశ్యం నేను వ్యక్తులను గురించి చెప్పినప్పుడు వారి సుగుణాలను కీర్తించాను తప్ప వ్యక్తులను కాదని పాఠకులు గమనించాలి

దావూద్‌సేఠ్ తన సత్యాగ్రహులైన సైనికులను వెంట బెట్టుకుని ట్రాన్స్‌వాల్ సరిహద్దురేఖ దగ్గరికి చేరుకున్నపుడు ప్రభుత్వం వారికి స్వాగతం పలికేందుకు సన్నద్ధంగా వుంది. ఇంత పెద్ద సైన్యాన్ని ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించటానికి అనుమతిస్తే దానికి అవమానమవుతుంది. అందువల్ల అందరినీ పట్టుకున్నారు 18 ఆగస్ట్ 1908 నాడు వారిని మేజిస్ట్రేటు ముందు హాజరు పరిచారు. ఏడు రోజులలోగా ట్రాన్స్‌వాల్ ను వదిలి వెళ్ళవలసిందిగా మేజిస్ట్రేటు వారిని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను సత్యాగ్రహులు పాటించని కారణంగా మళ్ళీ 28 ఆగస్ట్ నాడు ప్రిటోరియలాలో వారిని అరెస్టు చేశారు. మళ్ళీ కేసు పెట్టకుండానే ట్రాన్స్‌వాల్ నుండి వారిని తరిమివేశారు. 31 అగస్టున మళ్ళీ