పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

సంగ్రామ ప్రవేశం


మేధ్. ప్రాగ్‌జీ హందుభాయదేశాయ్, హరిలాల్ గాంధీ, రతన్ శ్రీ సోధా మొదలైనవారు సుశిక్షితులైన విద్యాధికులు దావూద్ సేఠ్‌గారి అర్ధాంగి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా వారూ యీ యుద్ధంలో పాలుపంచుకొనదలచారు

ఇప్పుడు నేను సెట్ దావూద్ మహమ్మద్ గారిని పాఠకులకు పరిచయం చేస్తాను. వారు నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అధ్యక్షులు దక్షిణాఫ్రికాకు వచ్చిన భారతీయు వ్యాపారుల్లో చాలా పాత వ్యాపారస్థులు వారే సూరత్ లోని ఓ సున్నీ కుటుంబానికి చెందిన వారు హాస్యప్రియత్వంలో దావూద్ ముహమ్మద్ గారిని మించినవారు, దక్షిణాఫ్రికా భారతీయులలోనే చాలా తక్కువ మంది వుంటారని నా అభిప్రాయం ఏవిషయాన్నైనా అర్థంచేసుకునే గొప్పశక్తి వారికి వుంది. వారు చదువుకున్నది చాలా కొంచెమే అయినా అనుభవం మీద ఆంగ్లం డచ్ భాషలు చక్కగా మాట్లాడేవారు. ఆంగ్ల వ్యాపారస్తులతో తమ పనులను చక్కగా చేసుకొనగలిగేవారు. వారి ఔదార్యం దానశీలత సుప్రసిద్ధాలు ప్రతిరోజు దాదాపు యాభై మంది అతిధులు వారియింట. భోజనం చేసేవారు. జాతికోసం సేకరించే విరాళాల క్రమంలో ఎప్పుడూ వాలిపేరు ప్రముఖంగా కనిపిస్తూనే వుండేది వారి ఏకైక పుత్రుడు, తండ్రిని మించిన దాన కర్ణుడు. అతని హృదయం స్పటికంలా స్వచ్ఛమైనది తన పుత్రుడి మనస్తత్వ వికాసంలో సేఠ్ ఎన్నడూ అడ్డంకి చెప్పలేదు. సేఠ్ తన కుమారుణ్ణి ఆరాధిస్తుండేవారని చెబితే అది అతిశయోక్తి కాదేమో కూడా తనలోని ఏ చిన్న లోపమూ తనకుమారునిలో రాకూడదని వారి ఆకాంక్ష హసన్‌ని ఇంగ్లాండ్ వంపించి చక్కగా ఉన్నత విద్య యిప్పించారాయన కానీ దావూద్ సేఠ్ తన ఈ పుత్రరత్నాన్ని చాలా చిన్నవయస్సులోనే పొగొట్టుకున్నారు హసన్‌ని టి బి వ్యాధి కబళించి వేసింది. ఈ గాయంవల్ల దావూద్‌సేఠ్ హృదయంలోగల ఆశారేఖలు అంతరించిపోయాయి హసన్ సచ్చరిత్రత తేజోవంతమైనది. ఇప్పుడు దావూద్ సేఠ్ కూడా లేరు కాలం ఎప్పుడు ఎవరిని విడుస్తుంది. కనుక