పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

241


వున్నపుడు వారుపగలూ రాత్రీ దాన్ని గురించే ఆలోచిస్తు అన్ని విధాలా సన్నద్ధులైవుంటారు. అందువల్ల ప్రతిభావంతంగా అడుగు ముందుకు వేసినపుడు ప్రభుత్వం కంటేవారు ఓ అడుగు ముందే వుంటారు. ఎప్పుడూ అనేక ఉద్యమాలు సఫలం కాకుండా ఆగిపోయేందుకు కారణం ప్రభుత్వంయొక్క అసాధారణమైన శక్తి సంపన్నత కాదు ఉద్యమ సంచాలకుల్లో పైన చెప్పిన లక్షణాలు లేకపోవటమే దానికి కారణం క్లుప్తంగా చెప్పాలంటే, ప్రభుత్వం యొక్క అజాగ్రత్తవల్ల లేదా, ఉద్దేశపూర్వకంగా రూపొందించిన ప్రణాళికవల్ల సోరాబ్జీ జోహాన్స్ బర్గ్ వరకూ చేరుకోగలిగాడు. అతని వంటి వారి పట్ల అధికారులెలా ప్రవర్తించాలో, పై అధికారుల నుండి ఎలాంటి సూచనలు స్థానీయ అదికారులకు లేక పోవటమూధీనికి కారణం ఈ విధంగా జోహాన్స్ బర్గ్ వరకూ సోరాబ్జీ చేరుకోవటం వల్ల జాతిప్రజలల్లో ఉత్సాహం పెరిగి పోయింది. ప్రభుత్వం ఓడిపోయిందనీ, కొద్ది సమయంలోనే భారతీయులతో ఒప్పందం కుదుర్చుకుంటుందని కొంత మంది యువకులు నిర్ధారణకు వచ్చారు. కానీ తమ ఊహ నిజం కాదని త్వరలోనే వారికి తెలిసింది. ఇంతేకాక యిలాంటి ఒప్పందం కుదరాలంటే తమ వంటి ఎందరో యువకులు బలి కావలసి వుంటుందని వారు తెలుసుకున్నారు

తాను బోహాన్స్ బర్గ్‌కి వస్తున్నట్లూ వలస చట్టం ప్రకారం తనను తాను జోహాన్స్ బర్గ్‌లో వుండేందుకు అర్హునిగా భావిస్తున్నట్లూ జోరాబ్జీ జోహాన్స్‌బర్గ్ పోలీస్ సూపరింటెంట్‌కు తెలియచేశాడు. తనకు ఆంగ్ల భాషతో పరిచయం వున్నట్లూ, జవసరమైతే దీనికి సంబంధించిన పరీక్షకు తాను హాజరయ్యేందుకు సన్నద్ధంగా వున్నట్లు కూడా తెలియచేశాడు. దీనికి ప్రత్యుత్తరమేమీ రాలేదు కానీ దీనికి జవాబుగా కొద్ది రోజుల తరువాత సోరాబ్జీకి సమనొకటి అందింది. 8 జూలై, 1905 నాడు కోర్టులో అతనికి వ్యతిరేకంగా కేసు నడిచింది భారతీయ ప్రేక్షకులతో కోర్టు క్రిక్కిరిసి పోయింది. వాదోపవాదాలు మొదలయయ్యే ముందు కోర్టు ముంగిట అక్కడికి వచ్చిన భారతీయుల మీటింగ్ ఒకటి జరిగింది. అందులో సోరాబ్జీ చాలా సామసోపేతంగా