పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

సోరాబ్జీ ఫాపుర్జీ అడాజణియా


ఉపన్యసించారు. జాతికి జయం చేకూరేంతవరకు ఎన్ని సార్లయినా జైలుకు వెళ్ళేందుకు తాను సిద్ధంగా వున్నాననీ, ఎంతపెద్ద కష్టమైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నాననీ సోరాబ్జీ ప్రతిజ్ఞ చేశాడు. ఈలోగా సోరాబ్జీతో నాకు చక్కటి పరిచయం ఏర్పడింది. నిజంగా సోరాబ్జీ మంచి జాతిరత్నమన్న విషయం అర్థమైంది. కోర్టులో కేసు మొదలైంది. వకీలుగా నేను సోరాబ్‌జీని ఆదుకున్నాను సమన్‌లో వున్న దోషాలపై మేజిస్ట్రేటు దృష్టిని ఆకర్షించి వాటి ఆధారంగా సోరాబ్జీకి యిచ్చిన సమనును రద్దు చేయమని కోరాను ప్రభుత్వ వకీలు తన వాదనను వినిపించాడు కానీ జూలై తొమ్మిదిన నా ఆరోపణలను దృష్టిలో వుంచుకుని, కోర్టు సమన్ ను రద్దు చేసి సోరబ్‌ను విడుదల చేసింది. భారతీయులు ఆనందదంతో పిచ్చివాళ్లై పోయారు

కానీ సోరాబ్‌జీ యిలా విడుదల కావటం చాలా తాత్కాలిక నిర్ణయమే 1908, జూలై 10వ తేదీన మళ్ళీ కోర్టు ముందు హాజరు కావల్సిందిగా సోరాబ్‌కు నోటీసు అందింది జూలై 10 నుండి వారం రోజుల్లోగా ట్రాన్స్‌వాల్ వదిలి వెళ్ళమని ఆజ్ఞజారీ చేయటం జరిగింది ఈ ఆజ్ఞను అందుకొన్న సోరాబ్‌జీ ట్రాన్స్‌వాల్‌ను వదలివెళ్ళటం తన లక్ష్యం కాదని పోలీస్ సూపరిండెండెంట్ శ్రీ వర్నాన్‌కు వర్తమానం పంపాడు. అందుకని అతణ్ణి మరోసారి కోర్టుకు తీసుకువచ్చి 20 జూలైన మేజిస్ట్రేటు ఆజ్ఞను ఖాతరు చేయని కారణంగా ఒక మాసం పాటు కఠినకారాగార శిక్షను విధించారు

కానీ స్థానికులైన భారత ప్రజలను ప్రభుత్వం నిర్బంధించ లేదు. ఎంత ఎక్కువ మందిని ఖైదుచేస్తే ప్రజలవుత్సాహం అంత ఎక్కువగా పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఇంతేకాక, చట్టంలోని చిన్న లోపం వల్లనైనా భారతీయులు శిక్షపడకుండా తప్పించుకుంటే వారిలో ఉత్సాహం రెట్టింపవుతుందని వారు తెలుసుకున్నారు. భారతీయులకు విరుద్ధంగా తేనున్న చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. చాలా మంది తమ అనుజ్ఞా పత్రాలను కాల్చివేశారు. ట్రాన్స్‌వాల్‌లో అవి లేకుండా వుండటం తమ హక్కుగా వారు ఋజువు చేసుకున్నారు. అందువల్ల కేవలం వారిని జైలుకు